వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించిన టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ .ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎంపీ శ్రీ పసునూరి దయాకర్, మాజీ ఉపముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి, ఎంపీలు శ్రీ సీతారాం నాయక్, శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్, మాజీ స్పీకర్ శ్రీ మధుసూధనాచారి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వరంగల్ గడ్డకు ఎనలేని ఖ్యాతి ఉంది
-28 రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది
-స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా రైతుల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. రైతుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే
-మన నాయకుడి పాలనా దక్షతను అందరూ చూస్తున్నారు. స్వీయ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆచార్య జయశంకర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఎప్పటికైనా పరాయి పార్టీలే
-రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేరుమార్చి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. రైతుబంధు పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అనే పథకం తీసుకొచ్చారు. పీఎం కిసాన్ పేరుతో కేంద్రం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది
-ఢిల్లీ మెడలు వంచే పరిస్థితిలో తెలంగాణ ప్రజలుండాలి. సంక్షేమ రంగానికి సీఎం కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం
-5 లక్షల మెజార్టీతో వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలిపించాలి
-బీజేపీకి కానీ, కాంగ్రెస్‌కు కానీ పూర్తిస్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని జాతీయ స్థాయి మీడియాలు చెబుతున్నాయి
భావసారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలు ఒక్కటైతే.. ఢిల్లీ గద్దె మీద ఎవరూ కూర్చోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే అవకాశం ఉంది
-16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తది. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా వస్తది. ట్రైబల్ యూనివర్సిటీకి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చు
-మిషన్ భగీరథపై కేంద్రం పెద్దలు ప్రశంసలు కురిపించారే తప్ప పైసలు ఇవ్వలేదు. మిషన్ భగీరథ, కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు
-పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదు
-రేపు దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. అందుకే మనం 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే ముక్కు పిండి నిధులు తెచ్చుకోవచ్చు