టీ కొట్టు సత్యవతికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…

మహిళా దినోత్సవం”నాడు
ఒక గొప్ప మహిళ విజయం గురించి తెలుసుకుందాం
కొందరు కాలం తమకు అన్యాయం
చేసిందని కన్నీరు పెట్టుకుంటారు.
కొందరు అదే కాలానికి ఎదురు వెళతారు.
కొందరు తమకోసం బ్రతికితే మరికొందరు
తమవారికోసం బ్రతుకుతారు.
ఇప్పుడు నేను చెప్పబోయే
మహిళ రెండో రకానికి చెందింది.
మహిళ తాను అనుకుంటే పురుషుల కంటే దీటుగా
ఇంకా చెప్పాలంటే పురుషులని మించిన
కష్టం త్యాగం చేయగల ఎందఱో మనచుట్టూ ఉన్నారు.
ఆమె పేరు : సత్యవతి
భర్త : ఆమెకు చిన్న వయసులోనే చనిపోయారు.
పిల్లలు : ఇద్దరు మగ పిల్లలు.
వృత్తి : టీకొట్టు
ఊరు : పుత్తూరు(చిత్తూరు)
పెళ్ళైన కొద్దికాలనికే భర్త పోతే
అప్పటికే ఇద్దరు పిల్లలతో ఎలా బ్రతకాలో తెలియక
చివరికి ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే
తన పిల్లలే తనకు గుర్తు వచ్చి వారిని
ప్రయోజకులని చేయాలని తనకు తెలిసిన “టీ కొట్టు”
పెట్టుకొని ఇరవైఏళ్ళ పాటు ఉదయం
మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు నిరంతరం
శ్రమ పోరాటంతో పిల్లలని ప్రయోజకులని చేయడం
తన పిల్లలు కూడా తల్లి కష్టాన్ని వృధా చేయకుండా
రాత్రి పగలు కష్టపడి ఒక అబ్బాయిని
కానిస్టేబుల్ అయితే..
మరొకరు దేశంలో అత్యున్నత IES
ఉద్యోగానికి ఎంపిక కావడం
నేటి సమాజంలో అన్నిటికి నిరుత్సాహపడే ఎందఱో
యువతీయువకులకి, తల్లిదండ్రులకి ముఖ్యంగా
మహిళలకి సత్యవతిగారి జీవితం ఆదర్శం.
ఆమె తన జీవితంలో ఎన్ని సుఖాలు
ఎన్ని కన్నీళ్ళు దాచుకుంది కాబట్టే నేడు
తన తనయుల విజయాన్ని జీవితాంతం ఆస్వాదిస్తుంది.
తన కొడుకు IES ఉద్యోగానికి
ఎంపిక కావడంతో ఢిల్లీకి రమ్మని అంటే..
ఇరవై ఏళ్ళు తనకి ఉపాధిని జీవితాన్ని ఇచ్చిన
ఊరుని టీ కొట్టుని విడిచి వెళ్ళలేక బలవంతంగా
కన్నీళ్ళతో తన కొడుకుతో పయనమయ్యారు సత్యవతి గారు.
ఇది ఒక నిజ జీవిత గాధ..
ఒక మహిళ విజయం..
తను నిలబడి దేశానికి ఇద్దరు పౌరులని
దేశానికి సేవకు అందించిన అసమాన్య మహిళ.

About The Author