ఏపీ లో… ముగ్గురు కీలక ఐపీఎస్ లకు పదోన్నతి…
ఏపీ లో… ముగ్గురు కీలక ఐపీఎస్ లకు పదోన్నతి…
నేడో,రేపో… లేక మరికాసేపట్లోనో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది అన్న తరుణంలో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకొంది… 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారులైన… ఏ.బి.వెంకటేశ్వరరావు, కే.ఆర్.ఎం కిషోర్ కుమార్, ద్వారకా తిరుమలరావు లను అడిషనల్ డీజీపీ స్థాయి నుంచి డైరెక్టర్ జనరల్(డీజీ) గా పదోన్నతులు పొందారు… వీరిలో ఏ.బి.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఛీప్ గా, కిషొర్ కుమార్, ఏపీ రైల్వే పోలీసు బాస్ కాగా… ద్వారకా తిరుమలరావు, విజయవాడ నగర సీపీ గా విధులు నిర్వర్తిస్తున్నారు…
రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల మధ్య డేటా వార్ జరుగుతున్న ఈ కీలక సమయంలో… ఆఘమేఘాలపై ప్రభుత్వం వీరి పదోన్నతి పై తీసుకొన్న కీలక నిర్ణయం… ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది… ఆంధ్రప్రదేశ్ లో పోలీసు యంత్రాంగం దాదాపుగా అధికార టీడీపీ కి వంత పాడుతోంది అనే ప్రతిపక్షాల విమర్శల నేపథ్యం… ఏపీ పోలీసు బాసును ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత మార్చవచ్చు అనే ఊహాగానాల నడుమ ప్రస్తుత పదోన్నతుల పై రాజకీయ విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు….
— స్రవంతీ చంద్ర