మ్రోగిన ఎన్నికల నగారా…
మ్రోగిన ఎన్నికల నగారా…
న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ వేదికగా… ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, సునీల్ అరోర 17వ లోక్ సభ ఎన్నికల సమరానికి షెడ్యూల్ ను ప్రకటించారు…
*ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరగడానికి అన్ని చర్యలు తీసుకొన్నాం.
* దేశవ్యాప్తంగా 90కోట్ల మంది ఓటర్లు ఉండగా, కోటిన్నర మంది కొత్త ఓటర్ల నమోదు జరిగింది..
* ఓటరు హెల్ప్ లైన్ నంబరుగా 1950
* పరీక్షలు, పండుగలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొన్న తరువాతే ఎన్నికల తేదీలను ఖరారు చేస్తున్నాము.
*జనవరి 21,22,28 తేదీలలో అన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించాము…
* ఫోటో ఓటరు స్లిప్పులను ఓటరు గుర్తింపు కార్డులుగా పరిగణించము.
* ఈవీయం లపై అభ్యర్దుల గుర్తుతో పాటు ఫోటోను కూడా ముద్రిస్తాము
*నేర చరిత్ర ఉన్న అబ్యర్ధుల వివరాలను ప్రసార, ప్రచురణ మాధ్యమాలద్వారా విస్తృత ప్రచారం చేస్తాము
* సోషల్ మిడియా ద్వారా ప్రచారానికి కూడా మీడియా మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి…
* సోషల్ మీడియా ప్రచార ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తాము
ఫేజ్ 1 నామినేషన్ల ప్రక్రియ మొదలు 25-03-2019
తొలివిడత పోలింగ్ 11-04-2019
మలివిడత పొలింగ్ తేదిలు…
Phase 2 – 18-04-2019
Phase 3 – 23-04-2019
Phase 4 – 29-04-2019
Phase 5 – 06-05-2019
Phase 6 – 12-06-2019
Phase 7 – 19-05-2019
* ఎన్నికల ఫలితాల లెక్కింపు మే 23న
* ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్ లోని ఇరవై ఐదు నియోజకవర్గాలకు ఎన్నిక
*తెలంగాణ లోని పదిహేడు నియోజక వర్గాలకు కూడా ఏప్రిల్ 11 న ఎన్నికలు
తెలుగు రాష్ట్రాల్లో…నామినేషన్ల దాఖలు ప్రక్రియకు మరో ఎనిమిది రోజులే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకు లోక్సభ ఎన్నికలతో కలిపి ఎన్నికలు నిరగవహించనున్న ఎలక్షన్ కమిషన్…