విజయసాయి రెడ్డి తప్పుకి ముగ్గురు ఐపీఎస్ లు బలి…
విజయసాయి రెడ్డి తప్పుకి ముగ్గురు ఐపీఎస్ లు బలి…
-తెలంగాణ ఐపీఎస్ అధికారులు సజ్జనార్,అంజనీ కుమార్,స్టీఫెన్ రవీంద్ర వెన్నులో వణుకు
-విజయసాయి రెడ్డి చేసిన చిన్న తప్పుకి బలైపోక తప్పదా?
-చట్టం ఎం చెబుతోంది
-ప్రభుత్వం నుండి ఒత్తిడి తట్టుకోలేక విజయసాయి రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి కోర్టు ముందు దోషులు గా నిలబడాల్సి వస్తుందా?
-తీవ్ర ఒత్తిడి లో ఉన్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు
-జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారులకు పట్టిన గతే పడుతుంది అంటున్న న్యాయ నిపుణులు
-చిన్న తప్పుకి బలైపోయాం అంటూ తెలంగాణ పోలీసుల నిట్టూర్పు
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ ఐఏఎస్ అధికారులు బలైపోయిన అంశం మీకు గుర్తుందా?ఎంతో ప్రతిభావంతురాలైన వై. శ్రీ లక్ష్మి చిన్న వయస్సు లోనే ఐఏఎస్ గా ఎంపికయ్యారు.ఒబులాపురం కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారిణి వై.శ్రీ లక్ష్మి జగన్ కేసులో అరెస్ట్ అయిన మొదటి ఐఏఎస్ అధికారి.అప్పటి ఏపీఐఐసి అధికారిగా ఉన్న బిపి ఆచార్య అరెస్ట్ అయిన రెండో ఐఏఎస్ అధికారి.ఇద్దరూ దేశంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఉత్తమ అధికారులుగా పేరున్న వారే.కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైయస్,తనయుడు జగన్ ఒత్తిళ్లకు తలొగ్గి జైలుకి వెళ్లాల్సి వచ్చింది.తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అన్నది పాత నానుడి.జగన్ విషయంలో మాత్రం ఇది నిజం కాదు.తాను తీసుకున్న గోతిలో తనతో పాటు అధికారులను కూడా పడేయడం ప్రతిపక్ష నాయకుడు జగన్ కి అలవాటు గా మారింది.ఇప్పుడు ఇది మరో సారి నిజం అయ్యింది.ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ని ఎదుర్కోవడానికి జగన్ కొత్త మార్గం వెతుకున్నారు.జగన్ తెలుగుదేశం పార్టీని ఇరకాటం లో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసారు.అయితే అవి అన్ని బెడిసికొట్టాయి.ఏపీ వేదికగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వ్యూహాలు ఏవీ ఫలించలేదు.అందులో మొదటిది డీఎస్పీ ప్రమోషన్లు కమ్మ సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు.ఈ సమాచారం తన సొంత ఛానల్ సాక్షి లో పనిచేస్తున్న సెక్రటేరియట్ రిపోర్టర్ సతీష్ అత్యంత గోప్యంగా అందిన సమాచారం.అది నిజమే అని నమ్మిన జగన్ కనీసం చెక్ చేసుకోకుండా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ని ఎక్కిపడేసాడు.ఆ తరువాత వారిలో దళితులు అత్యధికంగా ఏడుగురు, బీసీలు ఐదుగురు, ఎస్టీలు నలుగురు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురు, ఇతర ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఉన్నారు. వీరు కాక 2018 సంవత్సరం వరకూ ప్యానల్‌ను ఆమోదిస్తే రెగ్యులర్ డీఎస్పీలుగా ప్రమోషన్ పొందబోయే వారు మరో 35 మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో డీఎస్పీలుగా ఉన్నారు.ఇందులో బీసీలు తొమ్మిది మంది, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు, దళితులు ఏడుగురు, బలిజ, కాపు సామాజిక వర్గీయులు నలుగురు, ముస్లింలు ఇద్దరు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరు ప్రమోషన్లు అందుకోబోతున్నారు అని ప్రభుత్వం ఆధారాలతో బయట పెట్టింది.దీనితో జగన్ కంగుతిన్నారు.మరో సారి ఏపీ వేదికగానే జగన్ తెలుగుదేశం పై బాణం ఎక్కుపెట్టారు.కొండవీడు ఉత్సవాలు సందర్భంగా బిసి రైతు ని పోలీసులు కొట్టి చంపేశారు.ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ల్యాండింగ్ కోసం బిసి రైతు కోటయ్యని చంపేశారు అని జగన్ ఆరోపించారు.తీరా ప్రభుత్వం రైతు కోటయ్యది ఆత్మహత్య,వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆధారాలతో సహా నిరూపించింది.కోటయ్య ని రక్షించడానికి పోలీసులు పడిన కష్టాన్ని అక్కడే ఉన్న వ్యక్తి తీసిన వీడియోని బయట పెట్టి మరో సారి వైకాపా సెల్ఫ్ గోల్ వేసుకుంది అని నిరూపించింది.దీనితో ఏపీ భూభాగం పై ఆశలు వదులు కున్న జగన్ తెలంగాణ గడ్డ పై నుండి టిడిపి ని కొట్టాలి అని వ్యూహరచన చేసారు.ఈ సారి వ్యూహం పక్కా గానే రచించారు.తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి లో పటిష్టంగా ఉన్న పార్టీ.బూత్ కన్వీనర్ల దగ్గర మొదలు కొని సేవా మిత్ర వరకూ తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది.దీనిని దెబ్బతీయడం తో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల పై ద్రుష్టి పెట్టకుండా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవ్వాలి అనేది జగన్ లోటస్ పాండ్ లో రచించిన వ్యూహం.దీనికి పెద్ద కసరత్తే జరిగింది.బీహార్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే ఇచ్చిన సలహాల మేరకు విజయసాయి రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేసారు.జనవరి 16 న వ్యూహన్నీ అమలు చెయ్యడం మొదలు పెట్టారు.అదే రోజున లోటస్ పాండ్ లో కేటిఆర్-జగన్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సుమారుగా 40 నిముషాలు జగన్ ప్రతీ అంశాన్ని వివరించి తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరారు.ఆ రోజే ఆపరేషన్ ‘డి ‘ ని ప్రారంభించారు.ఆపరేషన్ డేటా వార్ మొదలైంది విజయసాయి రెడ్డి స్క్రిప్ట్,జగన్ ప్రొడక్షన్,కేటీఆర్ డైరెక్షన్,తెలంగాణ పోలీసుల యాక్షన్ ఇక్కడి వరకూ అంతా బాగానే చేసారు కానీ విజయసాయి చేసిన చిన్న తప్పుతో అందరూ దొరికిపోయారు.తెలంగాణ పోలీసులు చెయ్యాల్సిన తప్పుడు పనులు ఏంటి ?ఎలా చంద్రబాబు ని ,లోకేష్ ని ఇరికించాలి, ఆధార్,ఎన్నికల సంఘం సమాచారం ఉంది అంటూ ఎలా హడావిడి చెయ్యాలి?తెలంగాణ పోలీసులు ప్రెస్ తో ఎం మాట్లాడాలి?సేవా మిత్ర యాప్ ని ఎలా ఆపేయాలి సవివరంగా వివరిస్తూ విజయసాయి రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.ఒక్క చిన్న తప్పు దేశ వ్యాప్తంగా తెలంగాణా పోలీసులు,తెలంగాణ ప్రభుత్వం పరువు తీస్తుంది అని ముందుగా గమనించని పోలీసులు స్క్రిప్ట్ ఆధారంగా యాక్ట్ చేసుకుంటూ గంట కి ఒక ప్రకటన చేస్తూ రెండు రాష్ట్రాలను ఒక ఊపు ఊపారు. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తాం అని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్,ఆంధ్రా లో ఓట్లు పోయాయి ఆ కేసుని మేము చెదిస్తాం అంటూ మ్యాప్ గీసి హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్,నిందితుడు అమెరికా లో ఉన్నా,అమరావతి లో ఉన్నా పట్టుకుంటాం అంటూ సాక్షి పత్రిక రేంజ్ స్టేట్ మెంట్ ఇచ్చి వీరంగం సృష్టించారు.అంతా సజావుగానే జరిగింది.నిజంగానే డేటా చోరీ జరిగిందా అన్నంతగా అద్భుత నటన,అబ్బా-కొడుకు దొరికి పోయారు,చంద్రబాబు కి ఇవే చివరి ఎన్నికలు అంటూ కేటీఆర్ స్టేట్ మెంట్లు మరింత హీట్ పెంచాయి.ఈ లోపే తీగలాగితే డొంక కదిలినట్టు అసలు గుట్టు బయటపడింది. చిన్న తప్పు కొంప ముంచింది.ఆడిటర్ గారు తాను రచించిన కుట్ర పత్రాలు పొరపాటున ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు కి జతపరిచి ఇచ్చేసారు.ఇలాంటి సంక్షోభాలు ఎన్నో ఎదుర్కున్న చంద్రబాబు తన చాణిక్యాన్ని మరో సారి బయట పెట్టారు.బీజేపీ,వైకాపా,టీఆరెస్ నాయకులు సవాళ్లు విసురుతున్నా కంగారు కనీసం ఈ ఎపిసోడ్ గురించి ఆలోచించకుండా చంద్రబాబు పార్లమెంట్ వారీగా సమీక్షలు పూర్తి చేసారు.25 పార్లమెంట్ సమీక్షలు పూర్తి చేసి,120 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఫైనల్ గా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు చంద్రబాబు.అంత కష్టపడి తెలంగాణ వేదికగా వేసుకున్న వ్యూహాన్ని రెండు పేజీలు మీడియాకి ఇచ్చి బట్టబయలు చేసారు.దింతో డేటా పోయింది అంటూ హడావిడి చేసిన తెలంగాణ పోలీసులు ఒక్క సరిగా బిక్క పోయారు.అప్పటికి జగన్ కేసులో ఇబ్బంది పడిన పలువురు అధికారులు ఐపీఎస్ అధికారులు సజ్జనార్,అంజనీ కుమార్,స్టీఫెన్ కు ఫోన్లు చేసి అంతగా ఇన్వాల్వ్ అవ్వకండి మీరు కూడా మా లా ఇబ్బంది పడతారు,చట్ట ప్రకారం నడుచుకోండి అని సలహా ఇచ్చినా ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీస్ బాస్ ఈ స్కాం లో ఇరుక్కోవాల్సి వచ్చింది అట.ఎన్నికల కమిషన్ అధికార ముద్ర పడిన ఫిర్యాదులోనే కుట్ర వివరాలు అధికారికంగా ఉండటంతో ఇప్పుడు తెలంగాణ పోలీసులు తల పట్టుకుంటున్నారు అట. కుట్ర లోటస్ పాండ్ లో జరిగినా పబ్లిక్ గా దొరికిపోయింది తెలంగాణ పోలీసులు.ఎన్నికల సంఘం నుండి ఎలాంటి సమాచారం లేకుండానే ఫిబ్రవరి 23 న సోదాలు,ఉద్యోగస్తుల అక్రమ అరెస్టులు,డేటా చోరీ జరిగింది అని చెప్పాలి అంటూ బెదిరింపులు,మీడియా స్టేట్ మెంట్లు ఇలా అన్ని వీడియో,ఆడియో ఆధారాలతో సహా కుట్ర కి సంబందించిన సాంకేతిక ఆధారాలు కూడా ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయి అట.వీటిని న్యాయ స్థానాల ముందు ఉంచి న్యాయ పరంగా పొలిసు అధికారుల పై చర్యలు తీసుకోవాలి అని టిడిపి పోరాటం చేయబోతుంది. రాజకీయ కుట్ర 120బి రాజద్రోహం కేసు కింద తెలంగాణ పోలీసులు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.దీనికి సంబంధించి ఢిల్లీ స్థాయి లో పేరు ఉన్న ఒక ప్రముఖ న్యాయవాది ఈ కేసు ని వాదించనున్నారు అని సమాచారం.ఇది తెలుసుకున్న తెలంగాణ ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అట.అంతే కాకుండా ఐటీ గ్రిడ్ పై పెట్టిన కేసులు,సెక్షన్లు 120బి, 418, 420,380, 409, 167, 177,182 రెడ్ విత్ 511 కింద తెలంగాణ పోలీసులే విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.ఆయా సెక్షన్లు కుట్ర లో భాగంగా పెట్టినవి కాబట్టి అయ్యా సెక్షన్ల లో పడే శిక్షలు తెలంగాణ పొలిసు బాసులు అనుభవించాల్సి వస్తుంది అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.దీనితో సిట్ లో ఉన్న ఇతర అధికారులు జాగ్రత్త పడ్డట్టు సమాచారం.మనం మీడియా ముందుకు వెళ్లకుండా మంచి పనిచేశాం లేకపోతే మిగిలిన వాళ్లకి పట్టిన గతే మాకు పట్టేది అని సిట్ లో ఉన్న ఇతర అధికారులు తమ మిత్రులతో అభిప్రాయం పంచుకున్నారు అట.