మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం….
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై కడప వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో
మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం….
వివేకానంద రెడ్డి మరణంపై ప్రభుత్వం రకరకాలుగా మాట్లాడుతోంది….
విచారణ చేయకుండా, కాలయాపన చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోంది…
చంద్రబాబు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు…
చనిపోయాడని వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి మొదటగా నాకు సమాచారం ఇచ్చాడు..
అప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు..
పోలీసులు సంఘటన స్థలానికి రాకుంటే నేనే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చాను…
వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసుల్ని కోరాను..
పోస్టు మార్టం స్టార్ట్ చేయొద్దు…శవ పంచనామా చేయమని చెప్పాము..
అప్పటికే మేము ఇది సహజ మరణము కాదు ఇది అనుమానాస్పద మృతి అని అప్పుడే పోలీసులకి , మీడియాకి చెప్పాము..
గుండెపోటు అనేది కేవలం మీడియా కల్పితమే తప్ప తాము ఎక్కడా ఎవరికి చెప్పలేదు….
అల్లర్లు జరుగుతాయని మేము కొంత సంయమనం పాటించాం..
సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం..
కానీ మాపైన ఇలాంటి రాజకీయాలు పోలీసులు చేయడం దుర్మార్గం..
ఎన్నో సందర్భల్లో మీరు సిట్ వేశారు…కానీ ఎక్కడ కూడా బాధితులకు న్యాయం జరగలేదు…
సిట్ ద్వారా న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు…
సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం..
దోషులు ఎంతటి వారిని అయినా వదలకూడదు..
వివేకా మృతదేహం వద్దకు మేము వెళ్ళినప్పుడు ఎటువంటి లేఖ దొరకలేదు…
అది ఎలా వచ్చిందో పోలీసులే తేల్చాలి…