జనసేన లో ఎంపీ సీటు దక్కించుకున్న జబర్దస్త్ జడ్జ్…
తమ్ముడి కోసం అన్న రంగంలోకి దిగుతున్నారు. ఇన్నిరోజులుగా యూట్యూబ్ చానెల్ వేదికగా ప్రసంగాలు దంచికొట్టిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతునట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ తమ్ముడు ఎవరు..? ఆయన వెంట వచ్చే అన్న ఎవరు అని..? అని అనుకుంటున్నారా..? వారు మరెవరో కాదు.. తమ్ముడు పవన్ కల్యాణ్.. అన్న నాగబాబు. జనసేన అధినేతగా జనంలోకి వచ్చిన పవన్‌కు తోడుగా నిలిచేందుకు నాగబాబు కూడా ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
ఇన్ని రోజులూ మెగా ఫ్యామిలీ నుంచి పవన్ వెంట ఎవరూ లేరు.. ఎవరూ రాలేదు. కానీ.. అయితే.. నాగబాబు మాత్రం జనసేన పార్టీకి పెద్దమొత్తంలో పార్టీ ఫండ్ అందించారు. ఆ తర్వాత యూట్యూబ్ చానెల్ ఒకటి ఏర్పాటు చేసి.. దాని వేదికగా అధికార టీడీపీపై ఏదో ఒక విమర్శ చేస్తూ వస్తున్నారు. తాజా విషయం ఏమిటంటే.. నాగబాబు జనసేన పార్టీలో చేరి.. ఏకంగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు పవన్ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే.. ఈ ఎన్నికల్లో నాగబాబు కేవలం జనసేన తరుపు ప్రచారం మాత్రమే చేస్తారని ఆయన అభిమానులు అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా పార్టీలో చేరడమేకాదు.. లోక్‌సభ స్థానం పోటీ చేసేందుకు రెడీ అవుతుండడంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే.. నాగబాబు జనసేనలో చేరాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారని.. అందులో భాగంగానే.. యూట్యూబ్ చానెల్ వేదికగా రాజకీయ విమర్శలు చేసారని పలువురు అంటున్నారు.