మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ లో ఎన్నికల ప్రచారం…
మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ లో ఎన్నికల ప్రచారం.
– గరీబీ హాటావో పై రాహూల్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
– గరీబీ హఠావో నినాదంతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు.
– గరీబీ హఠావో అనే నినాదాన్ని 1971 లో రాహూల్ గాంధీ నాయినమ్మ ఇందిరా గాంధీ, 1989లో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ఎత్తుకోని దేశం నుంచి పేదరికాన్ని ఎందుకు మన దేశం నుంచి పారదోల లేకపోయారు.
– ఇలా పేదరికం పేరుతో…దేశంలోని పేదలతో ఎన్నాళ్లు ఆటలాడతారు. పేదలను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు మోసం చేస్తారు.
– పేదరికరం, పేదవాళ్ల పేరుతో అధికారంలోకి రావాలా, స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు అయినా ఇంకా పెదవాళ్లు.. పేదరికంలోనే ఏందుకు ఉన్నారో రాాహుల్ గాంధీ దేశానికి సమాధానం ఇవ్వాలి.
– ఇందిర, రాజీవ్ గాంధీలు ఎందుకు పేదరికం పోగొట్ట లేదు… ఇది ప్రజలను మోసం చేయడం కాదా…
– ముందుగా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్ ఓట్లు అడగాలి.
– నిజమైన పేదరిక నిర్మూల చేపడుతోంది, సీఎం కేసీఆర్ మాత్రమే
– కాంగ్రెస్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే…కేసీఆర్ ఆ పెన్షన్ వేయి రూపాయలుచేశారు. రైతు బంధు పేరుతో రైతులకు ఆర్థికసాయం అందించారు. పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికసాయం చేస్తున్నారు. కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో పేదరిక నిర్మూలకు చర్యలు తీసుకున్నారు.
– నినాదాలు తప్ప పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏం చేసింది
– రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఆకలి చావులు లేవు. వలసలు తగ్గాయి. దేశమంతామన పథకాలు అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. పేద విద్యార్థుల చదువుల కోసం 500 ఆంగ్ల గురుకుల పాఠశాలలను కేసీఆర్ గారు ప్రారంభించి వారి చదువులకు ఏడాదికి లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నారు.
– తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కాంగ్రెస్ మోసాలు పసిగట్టే తెలివి ఇక్కడి ప్రజలకు ఉంది.
– తెలంగాణ తెస్తామని 2001లో చెప్పాం… తెలంగాణసాధించాం. వెయిరూపాయల పెన్షన్ ఇస్తామన్నాం. ఇస్తున్నాం. వచ్చె ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పెన్షన్ 2016 రూపాయలకు పెంచి ఇస్తాం. దసరా నాటికి డబులు బెడ్ రూంఇల్లు పై సా ఖర్చు లేకుండా పేదలకు అందిస్తాం. ఉద్యోగం దొరికే వరకు నిరుద్యోగులకు 3 వేల రూపాయల భృతి ఇస్తాం.
– ఇంటికి పెద్దకొడుకులా పెన్షన్లను పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
– ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని 5 లక్షల మెజార్టీతో గెలిపించాలి. ఏప్రిల్ 11వ తేదీన అందరూ ఓటు వేయాలి.
– బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు డిపాజిట్ గల్లంతయ్యే పార్టీలు. వాటికి ఓటు వేస్తే…మోరీలో వేసినట్లే.
– పోటీ కాంగ్రెస్, బీజేపీలతో కాదు…సిద్దిపేట నుంచి మెజార్టీ ఎక్కువ ఉంటుందా….పఠాన్ చెరు నుంచి మెజార్టీ ఎక్కువ వస్తుందా అన్నదే పోటీ.