కొమ్మ కొమ్మకో సన్నాయి:- గోరింటాకు (1979)
https://www.facebook.com/474123499353156/videos/572279589959922/?t=77
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి?❤️
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం❤️
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి??
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం??
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది❤️❤️
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది??
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు❤️❤️
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు?❤️
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు?
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి??
అందుకే ధ్యానం అందుకే మౌనం. అందుకే ధ్యానం అందుకే మౌనం❤️
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల