శ్రీ శీతలాదేవి..అమ్మవారు….
ఈ క్రింది ఫోటోలో ఉన్న అమ్మవారు శ్రీ శీతలాదేవి..
భయంకరమైన తీవ్రమైన రోగాలను నిర్మూలించే అమ్మవారు శ్రీ శీతలా దేవి. ఈ అమ్మవారిని స్మరించినంత మాత్రం చేతనే తీవ్ర వ్యాధులకు కూడా ఉపశమిస్తాయని శాస్త్రం చెబుతోంది.. అమ్మ వారి గురించి మరింత వివరంగా రేపు చెప్పుకుందాం… ఇప్పుడు అమ్మ వారి గురించి చెప్పడానికి కారణం ఏంటంటే
హోలీ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి తిధులను శీతలా సప్తమి, శీతలా అష్టమి అంటారు..
రేపు అనగా 28 మార్చి 2019, గురువారం శ్రీ శీతలా అష్టమి. లోక క్షేమం కోసం తీవ్ర వ్యాధుల నిర్మూలన కోసం ఈనాడు అందరూ శీతల దేవి ని ఆరాధించాలి అమ్మవారి అష్టకం ఇందులో ఉన్నది… చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పంతో అందరూ ఈ అమ్మ అష్టకాన్ని పఠించి వేడుకుందాం…
శ్రీ శీతలా దేవి అష్టకం (Sri Sheetala Devi Ashtakam)
అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః
అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా
లక్ష్మీర్బీజం – భవానీశక్తిః
సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః
ఈశ్వర ఉవాచ:
వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్|
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్||
వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్|
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్||
శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః|
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి||
యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః|
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే||
శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ|
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్||
శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్|
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ||
గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్|
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్||
నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే|
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్||
మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్|
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే||
అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా|
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే||
శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః|
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్||
శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా|
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః||
రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః|
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః||
ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్|
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే||
శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్|
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై||
ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సంపూర్ణం