నయనతార సినిమా AIRAA …
నయనతార సినిమా అంటే హీరో ఎవరు అని అడగాల్సిన అవసరం లేదు..
అంతగా సినిమా సినిమాకు ఇమేజ్ పెంచుకుంటుంది ఈమె..
అందుకే నయన్ సినిమాలంటే ఏదో తెలియని ఆసక్తి..
ఇప్పుడు ఐరాపై కూడా ఇదే ఆసక్తితో వెళ్లాను నేను.. పైగా డ్యూయల్ రోల్ చేసింది కదా..
కచ్చితంగా ఈ సారి కూడా ఏదో మాయ చేసుంటుందనే నమ్మకం అయితే ఉండేది..
కానీ ఆ అంచనా తప్పు అని.. అన్ని సినిమాలు ఒకేలా ఉండవని కాసేపటికే క్లారిటీ వచ్చింది..
ఫస్టాఫ్ వరకు మళ్లీ అదే హార్రర్ సస్పెన్స్ మెయింటేన్ చేసిన దర్శకుడు సర్జున్..
సెకండాఫ్లో మరో కథ మొదలు పెట్టాడు.. కథ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడం మైనస్..
హార్రర్ సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్లు ఉండటంతో ఇంట్రెస్టింగ్ అనిపించలేదు..
పైగా సెకండాఫ్ మరీ మెలో డ్రామా ఎక్కువైపోయింది.. పాత సినిమా చూసినట్లు అనిపిస్తుంది..
దాంతో అసలు కథ పక్కదారి పట్టేసింది.. ఫ్లాష్ బ్యాక్ నీరసంగా సాగింది..
మరో నయనతార పాత్రకు మరీ డ్రామా ఎక్కువైపోవడంతో కథ బలహీనంగా మారిపోయింది..
ఓవరాల్గా నయనతార కూడా అప్పుడప్పుడూ తప్పులో కాలేస్తుంది..