తెలంగాణ పర్యాటక శాఖ – కీరజిస్ రిపబ్లిక్ సమావేశంలో…

బేగంపేట లోని పర్యాటక భవన్ లో తెలంగాణ టూరిజం ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో ఎంబసీ ఆఫ్ కీరజిస్ రిపబ్లిక్ కు చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అధికారిణి డా. ఫాతిమా సుశాంలో, ఫస్ట్ సెక్రెటరీ ఆఫ్ కాన్సుల్ ఆఫ్ కీరజిస్ రిపబ్లిక్ చెందిన అధికారులు సమావేశమయ్యారు.
(Embassy of the Kyrgyz Republic)
తెలంగాణ పర్యాటక శాఖ – కీరజిస్ రిపబ్లిక్ లో పర్యాటకులను ఆకర్షించేందుకు రోడ్ షో లు నిర్వహించాల్సిందిగా ఎంబసీ ఆఫ్ కీరజిస్ రిపబ్లిక్ అధికారుల విజ్ఞప్తి కి తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సానుకూలంగా స్పందించారు. కీరజిస్ రిపబ్లిక్ లో తెలంగాణ పర్యాటక శాఖ ప్రదర్శనలు నిర్వహించాలని కీరజిస్ రిపబ్లిక్ ఎంబసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారులు కీరజిస్ రిపబ్లిక్ లో కళా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ – అక్టోబర్ నెలలో కీరజిస్ రిపబ్లిక్ కు చెందిన పర్యాటక శాఖ అధికారులు పర్యాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కు వివరించారు. అందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ పర్యాటక శాఖ . అందించాల్సిందిగా కోరారు.
కీరజిస్ రిపబ్లిక్ – తెలంగాణ రాష్ట్రo ల మధ్య సాంస్కృతిక, పర్యాటక రంగాలలో పరస్పరం సహకరించుకొవటానికి కీరజిస్ రిపబ్లిక్ అధికారుల విజ్ఞప్తి కి పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యం గా ప్రణాళికలు రూపొందించినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కీరజిస్ రిపబ్లిక్ అధికారులకు వివరించారు.ఈ సమావేశంలో ఇండియా టూరిజం సహాయ డైరెక్టర్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

About The Author