PSLV C-45 ప్రయోగం సూపర్ సక్సెస్…
PSLV C-45 ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి..9.27 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే ఎమిశాట్ నిఘా ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లింది PSLV C-45. ఎమిశాట్ తో పాటు 28 విదేశీ నానో ఉపగ్రహాలను రాకెట్ రోదసిలోకి తీసుకెళ్లింది. అమెరికాకు చెందిన 24, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్ కు చెందిన ఒక్కో ఉపగ్రహన్ని .. కక్ష్యంలోకి ప్రవేశపెట్టనుంది .
ఎమిశాట్..భారత్ నిఘా వ్యవస్థలో అంత్యంత కీలకమైన ఉపగ్రహం. ఇలాంటి ఉపగ్రహన్ని భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ సరిహద్దుల్లో శతృదేశాల రాడార్ల కార్యకలాపాల్ని కనుగొనడం,శత్రు దేశాల భూభాగానికి సంబంధించిన మెరుగైన చిత్రాలను ఎమిశాట్ అందిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ పరికరాలు ఎన్ని పని చేస్తున్నాయో కనిపెట్టి సమాచారం ఇస్తుంది. శతృరాడార్లకు చిక్కకుండా ఎమిశాట్ పనిచేస్తుంది. సరిహద్దుల్లోని కీలకప్రాంతాల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ పరికరాలు ఎన్ని పనిచేస్తున్నాయనే విషయాన్ని భద్రతా, నిఘా సంస్థలకు చేరవేస్తుంది.