అస్సాంలో వేలమంది అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారు?: సుప్రీంకోర్టు..
అస్సాంలోని స్థానిక జనాభాతో మిళితం అయి ఉన్న 70వేల మంది అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారని సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. అంతేకాకుండా సొలిసిటర్‌జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన నివేదికపై సుప్రీం బెంచ్ మొత్తం 70వేల మంది అక్రమవలసదారులను గుర్తించే విధానాలు నివేదిక కావాలనికోరింది.
ఈనెల 8వ తేదీ సుప్రీంకు అస్సాం ప్రధాన కార్యదర్శి స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. హోంశాఖ అధికారులు ఒక అఫిడవిట్‌ను సుప్రీంకోర్టులో దాఖలుచేసింది. మొత్తం 91,609 మంది విదేశీయులను వివిధ ట్రిబ్యునల్స్ అక్రమ వలసదారులుగా గుర్తించిందని వెల్లడించింది వీరిలో 72,486 మంది ప్రస్తుం పరారీలో ఉన్నారని భారీ సంఖ్యకు పెరిగిందని హోంశాఖ ఆందోళన వ్యక్తంచేస్తూ నివేదిక ఇచ్చింది.
చీఫ్‌జస్టిస్ రంజన్ గగో§్‌ు అధ్యఓఒతన ఉన్న బెంచ్ మాట్లాడుతూ ఇలా అప్రకటిత విదేశీయులును ఎలా గుర్తించి చర్యలు తీసుకుంటారని సుప్రీం ఘాటుగా స్పందించారు.