పోలింగ్ సమయం గంట పెంచిన ఈసీ… సాయంత్రం 6 గంటలవరకు ఓటింగ్…

గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిపారు
దేశవ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈసారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలవరకు కాకుండా… 6 వరకు ఓటింగ్ జరగనుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలు కల్పించేందుకే ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ సమయాన్ని గంట పొడిగించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిపారు. ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు దాన్ని నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు.
అయితే పోలింగ్ సమయాన్ని పెంచేందుకు ఈవీఎంల విధానంలో ఓటు వేశాక తమ ఓటు ఎవరికి వేశామో తెలుసుకునేందుకు వీవీ ప్యాట్‌‌ అనే మెషిన్‌ ద్వారా చూసుకోవచ్చు. వీవీ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు ఓటు వేసిన గుర్తు కనిపిస్తుంది. దీంతో పోలింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో పాటు ఓటింగ్ అవగాహన పెరగడంతో ఈ మధ్య ఓటర్లు కూడా పెరిగారు. వేసవి కావడతో సాయంత్రం సమయంలోనే ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం పెరగడం… ఓటర్లు కూడా భారీగా తరలివస్తుండటంతో ఎన్నికల సంఘం ఈసారి పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల మేరకు… లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏప్రిల్‌, మే నెలల్లో 7 విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. తొలి విడత పోలింగ్‌ ఏప్రిల్ 11 న నిర్వహంచనున్నారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదో దశ మే 6, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహిస్తారు. మే 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.  తొలి విడత ఏప్రిల్ 11న అంటే మరో వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో 25లోక్ సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు… , తెలంగాణ 17 లోక్‌సభ‌కు ఎన్నికలు జరగనున్నాయి.

About The Author