ఈయన పేరు జోగేంద్రనాద్ మండల్ పాకిస్తాన్ వ్యవస్థాపకులలో ఒకరు…


ఈయన పేరు జోగేంద్రనాద్ మండల్ (1904-1968) , దళిత నేత , పాకిస్తాన్ వ్యవస్థాపకులలో ఒకరు .ఆనాటి అవిభాజ్య బెంగాల్ లో , ఇప్పటి బంగ్లాదేశ్ లో జన్మించాడు . దళితులు ముస్లిములు పాలన లో సంతోషంగా ఉంటారని విశ్వసించాడు . పాకిస్తాన్ ఏర్పాటును సమర్ధించి .కరాచి కి వలస వెళ్లి పాకిస్తాన్ కి మొట్టమొదటి న్యాయాశాఖ మంత్రిగా పనిచేసారు . కొన్ని రోజులయ్యాక అక్కడి దళితులను వేలమందిని బలవంతంగా ఇస్లాం లోకి మార్చడం కళ్ళారా చూసాడు . వాటిని వ్యతిరేఖించినందుకు చాల పరిణామాలు ఎదుర్కొన్నాడు .ఈయనను కూడా ఇస్లాం లోకి మారమని లేకపోతే పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ముస్లిం మతపెద్దలు బెదిరింపులకు గురిచేసారు . ఆఖరున 1950 లో భారత్ వలస వచ్చి శరనార్ది గా పేరు నమోదు చేయించుకున్నాడు . తాను కళ్ళారా చూసాక అర్ధమయ్యింది మెజారిటి ముస్లిముల పాలనలో ముస్లిమేతరుల పరిస్థితి ఎట్లా ఉంటుందో . ఇప్పటికి మన భారతదేశం లో కొన్ని దళిత సంఘాలు జై భీం – జై మీమ్ అంటూ ముస్లిము సంఘాల వెనుక తిరుగుతున్నాయి అలాంటి సంఘాల యొక్క భవిష్యత్తు ఈయన ఆనాడే చూసాడు .పాకిస్తాన్ లో మంత్రిగా పనిచేయడం వలన , పాకిస్తాన్ ఏర్పాటును సమర్ధించడం వలన భారతపౌరసత్వం లభించలేదు . ఆఖరికి పాకిస్తాన్ పౌరుడిగానే బెంగాల్ లో ఒక అనామకుడిలా 1968 వ సంవత్సరం లో మరణించాడు .

About The Author