ఓట్ల లెక్కింపు పై సుప్రీం… సంచలన తీర్పు…

పోల్ అయిన ఓట్ల లో 50% వీవీపాట్ స్లిప్పులు లెక్కంచాలంటే దాదాపు ఆరు రోజులు పడుతుందని, అది సాధ్యమయ్యే ప్రక్రియ కాదు అని, కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకు నివేదించగా… దానిపై ప్రతి పక్షాలు కౌంటర్ దాఖలు చేసాయి… ఇరువురి వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం… ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీపాట్ లను, ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి, 35 వీవీపాట్ల లోని స్లిప్పులను లెక్కించాల్సిందిగా తీర్పును వెలువరించింది…

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో ప్రతిపక్షాలకు ఊరట

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టులో ప్రతిపక్షాలకు ఊరట లభించింది. సోమవారం దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో…5 వీవీప్యాట్‌ల స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరపాలని పేర్కొంది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న. ఈసీ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది.

ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని ఆరోపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉండే ఈవీఎంలలో 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికీ… ఫలితాలు వెల్లడించడానికీ దాదాపు ఆరు రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ యేతర పార్టీల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు రోజులు పట్టినా పర్వాలేదనీ, వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని ఆదేశించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ సమగ్ర విచారణ చేపట్టి… ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

About The Author