నుదుటి సింధూరం…
“కుంకుమకు నుదుటిన పెట్టుకోవటం కూడ ఆడవారు ఒక బంగారు
ఆభరణానికి మించి విలువ ఇస్తారు
భారతదేశమంతటా కుంకుమ ధరించడం పెళ్లైన మహిళల్లో ఒక ఆచారంగా మారిపోయింది. కుంకుమ పెట్టుకోకున్నా మరిచిపోయినా ఏదో లోటుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా ఇంట్లోకి స్త్రీలు వచ్చినప్పుడు ఆ ఇంటి మహిళ కుంకుమ ఇవ్వడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇలా కుంకుమను ఇవ్వడం ద్వారా పరస్పర గౌరవం, ప్రేమ, అనురాగాన్ని పెంచుకుంటారు. ప్రతి పండగకు, మిగతా వేడుకలకు దక్షిణ భారతదేశంలో ముత్తైదువలు బంధువులు, స్నేహితులకు పసుపు, కుంకుమ వాయినంగా ఇస్తుంటారు. దీనిని సారె అని కూడా అంటారు.ఇక పశ్చిమ బంగాలో పెళ్లైన మహిళలు విజయ దశమి రోజున సింధూర్ ఖేలా జరుపుకుంటారు. ఆ రోజున దుర్గామాతకు కుంకుమ సమర్పించి ముఖాలకు రాసుకుంటారు. ఈ పద్ధతి ద్వారా ప్రతి మహిళా ఆదిశక్తి స్వరూపమే అని తెలియజేస్తారు.
“ఈ రోజుల్లో కొందరు ప్యాషన్ గా పెడుతున్నారు కొందరు అసలు పెట్టుకోవటమే మానేస్తున్నారు ఒకరికోసం అని కాదు కాని కొన్ని అలంకారాలు ఆడవారికి ఎంతో గౌరవాన్నిస్తాయి వారి విలువను పెంచుతాయి ”
*నేటి ఆధునిక జీవనవిధానం ఉండాలి అలాగే మన విలువలు పాటించగలగాలి