ఈ తాత కు ముగ్గురు కొడుకులంట…పాపం…


ఈ తాత కు ముగ్గురు కొడుకులంట
ముగ్గురిలో ఒకరికి కూడా ఈతాతకు
అన్నం పెట్టి చూసుకునే మనసురాలేదా.. ?..

మద్యాహ్నం ఎండలో నడుస్తూ వస్తున్నాడు
నా దగ్గరకు వచ్చి
అమ్మ ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టించమ్మా
ఎక్కడైనా అని అన్నాడు..

సరే రా తాత అని ఒక చిన్న హోటల్ కు
తీసుకెల్లాను
అన్నం పెట్టించాను తిన్నాడు..

రోజు ఎలా తింటావ్
ఎక్కడుంటావ్ తాత అని అన్నాను..

గోవిందరాజు గుడిలో ఉంటానమ్మ
దేవుని కీర్తనలు పాడుతూ ఉంటాను
పొద్దున పూట సాయంత్రం పూట
ప్రసాదం పెడతారు తింటాను
మద్యానం పూట అన్నానికి
ఇబ్బంది అమ్మ అని అన్నాడు..

ఎవరినైనా అడుగుతాను
కొందరు అన్నం పెట్టిస్తారు
మరి కొందరు చిల్లర ఇస్తారు ..

భోజనం సరిపడా చిల్లర రాగానే అన్నం తిని ఎక్కడైనా షాపులముందుగాని
లేదా చెట్టుకింద గాని
నిద్రపోతానుమా అని అన్నాడు..

అన్నం కు సరిపడా చిల్లరకోసం
రోజు మద్యాహ్న సమయంలో
ఎండలో చేతికర్ర సాయంతో నడవలేక నడుస్తున్నాడు…

ఇంక మీదట ఎండలో అంతలా తిరగకు తాత
గుడిదగ్గరనుండి
మా నాన్న వాళ్ల షాపు దగ్గరే
రోజు అక్కడికి వెళ్ళు అన్నం పెడతారు
తిని అక్కడే నిదురపోయి
వెళ్ళు మళ్లీ గుడికి అని అన్నాను..

షాపు దగ్గరకు తాతను తీసుకెల్లాను
అమ్మ నాన్న ను పరిచయం చేసి
తాతకు రోజు అన్నం పెట్టండి అని చెప్పి
అక్కడ అందరికి మన తాతె ఎప్పుడొచ్ఛినా చూసుకోండి అని పరిచయం చేసి వచ్చాను..

సరే తల్లి ఇక్కడకు వచ్చి తిని వెలతాను
అని అన్నాడు..

కొద్దిసేపు మాట్లాడాము
ఏదైనా పని చేస్తానమ్మ ఇక్కడ
నేను చెయగలిగే పని ఏమైనా ఉంటే
చెప్పమ్మా అని అన్నాడు..

ఈవయసులో నువేం పని చెయకు తాత
నీ కొడుకులు ఒదిలేసినా
నీకూతురులాంటిదాన్ని నేను చూసుకుంటాను
నీకు ఏం కావాలో నాకు చెప్పు చూసుకుంటాను
పనికి మాత్రం ఈవయసులో పోకు అని అన్నాను..

నేనుతినే అన్నం ముద్దకయినా
పనిచెయాలికదామా ఊరికినే తినలేం కదామా
రోజు వచ్చి అని అన్నాడు..

అలా ఏం అనుకోకు తాత నీ కన్నబిడ్డ దగ్గర తింటున్నా ను అని అనుకో..
అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు
రోజు వచ్చి తినేసి వెళ్ళు అమ్మ పడుతుంది..

అలా తినలేనంటే నేనే రోజు చేసి పంపిస్తాను
ఒక చిన్న బాక్స్ లో అని అన్నాను
అయ్యొ ఒద్దులే మా
నువు ఎక్కడో దూరాన ఉన్నావ్
నాకోసం ఇంతదూరం ఒద్దులే మా
అమ్మ దగ్గరే తింటాను అని అన్నాడు..

సరే తాత అని అన్నాను

సరే అని వచ్ఛేముందు
150 రూపాయల డబ్బు ఇచ్చాను
తీసుకోతాత అని అయ్యొ ఒద్దమ్మా అని అన్నాడు..

ఎంతగా బలవంతం చేసినా తీసుకోలేదు
అమ్మ కడుపునిండా అన్నం పెట్టించావ్..
రోజు ఇక్కడకు వచ్చి తినమని
దారి చూపించావ్
అది చాలమ్మ అని ఇంకెందుకు
డబ్బులు అని తీసుకోలేదు..

ఎంతబలవంతం చేసినా కూడా తీసుకోలేదు
తాత తీసుకో నేను రోజు రాలేను ఇక్కడకు
నువు ఇక్కడకు ఎండలో రాలేని పరిస్థితిలో
అక్కడే దగ్గరలో సంగటిముద్ద అయినా తిను
లేదా “టీ” తాగు అని అన్నాను
ఒద్దమ్మా డబ్బులు నేను టీ లు కాఫీలు తాగను
ఏం అలవాటు లేదు..

డబ్బులు ఒద్దమ్మా రోజు అన్నం తినే
దారి చూపావ్ చాలమ్మ అని అన్నాడు..
బలవంతంగా నామీద ఇష్టం ఉంటే
ఈడబ్బు ఒద్దనకు తాత అని
తాత జోబీలో పెట్టాను..
ఆమాటకు కాదనలేకపోయాడు….
తీసుకున్నాడు..

నన్ను అన్నం తిన్నావ తల్లి అని అన్నాడు
లేదు తాత వెళ్ళితినాలి అని అన్నాను
నాకు అన్నం పెట్టించి నువు తినకుండా
నాకోసం ఉండావ తల్లి ముందు అన్నం తిను
నాయన అని అన్నాడు
తింటాలే తాత అని అన్నాను..

చానా అన్నం పొద్దు దాటిపోయింది
ఇంకా తినకుండా ఇక్కడే
మీ అమ్మ దగ్గరైనా తినుమా
ఎండలో నువు మళ్లీ ఎంతదూరం
పోవాలో నాయన
ఒక చేతిపిడసన్నం తినేసిపో తల్లి
అని ఎంతో ఆప్యాయంగా చెప్పాడు..

ముఖంలో ఏదో తెలియని
బాధతో బిడ్డతినలేదు నాకు తినిపించిందే
అని మనసులో బాధతో అన్నాడు..

సరేతాత వెళుతున్న అని చెప్పాను
ఎందుకో ఆత్రంగా లేచాడు
రోడ్డులో ఒక అట్టముక్క చింపి
నాయన నీఫోన్ నెంబర్ ఈతల్లి నువు ఎప్పుడు కనబడతానో ఎమొ మాట్లాడుతాను ఫోనుఎవరిదగ్గరైనా చేపించి అని నెంబర్ తీసుకున్నాడు..

సరేతాత ఎప్పుడైనా చెయి
ఏం అత్యవసరం అయినా నేనున్నా
నేను చూసుకుంటాను బాధపడకు అని చెప్పాను..

వచ్చేముందు చేతులెత్తి ధన్నం పెట్టాడు
దండం పెట్టకూడదు తాత ఆశీర్వదించాలి
నేను నీకు బిడ్డలాంటి దాన్ని అని చెప్పి వచ్చేశాను..

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే
ఒకపూట అన్నం తినినా కూడా ఆతినిన చేతిపిడసన్నానికి కూడా ఏం పని చెయ్యాలి
ఊరకనే తినకూడదు అనే ఆతాతలోని ఆత్మవిశ్వాసం నచ్చింది..
ఎందరో యువత సోమరులు గా తింటున్న
వారికి తాత మాట ఒక గుణపాఠం..

డబ్బులు ఇవ్వబోతే ఒద్దమ్మా
రోజు అన్నం తినడానికి దారి చూపావ్
ఇంతకన్నా ఏంకావాలి
డబ్బుతో పనేం ఉంది అనిన
ఆతాత నిజాయితీ నచ్చింది..

బలవంతంగా డబ్బులు ఇవ్వబోతే
ఏ అలవాటు లేని
ఆతాత గొప్ప నడవడికనచ్చింది..

ఎవరో తెలియకపోయినా
ఒకపూట నేను అన్నం పెట్టాననే
కృతజ్ఞతతో నేను తినలేదే ఇంకా అని
తాత ముఖంలో తాపత్రయం నచ్చింది..

నేను ఎవరో తెలియకపోయినా
నేను అన్నం తినలేదని
తాపత్రయపడిన తాత
తనకన్న బిడ్డల పెంపకం గురించి
ఇంక ఎంతలా తాపత్రయపడి ఉంటాడు
ఎంతలా పెంచి ఉంటాడో అర్దం చేసుకోండి..

ఇంతమంచి మనిషిని
ఇలా రోడ్ల పాలు చెయడానికి
మనసెలా వచ్చింది…
కనీసం ముగ్గురిలో ఒకరికైనా
ఈతండ్రిని చూసుకోవాలనే మనసు లేకపోవడం ఎంతో దౌర్బాగ్యం..

ఈచిత్రం ఈమాటలు షేర్ చేసి
తాత కొడుకులు చూసి తాతను
చేరదీయాలని కోరుకుంటున్నాను..

నేను చూసుకోగలను
కాని తాతకు తృప్తి ఉండదు
ఏతల్లి కన్నబిడ్డనో నేను చూడటం
తన కన్నబిడ్డలు ఇలా ఒదిలేయడం
ఆతండ్రికి మనసులో కడుపుకోతే ఉంటుంది..

దయచేసి ఈతాత బిడ్డలు తాతను చూసుకోండి..?

తిరుపతి గోవిందరాజుల గుడిలో
తాత ఉంటాడు..

(తాత బిడ్డలకు)
మీకు ఈతాత ఉండే అడ్రస్ తెలియాలని
ఈఫోష్టు చేరాలని మీరు తాతను ఆదరించాలని ఫోటోతో సహా అన్ని వివరాలు రాసి పెడుతున్నాను..

About The Author