ఎన్నికల సంఘం సరిగా పని చేస్తుందా ??


మన దేశంలో జనాభా 130 కోట్లు..
అందులో ఈ ఎన్నికల్లో ఓటు వేసేవారి సంఖ్య 90 కోట్లు.
అంటే అమెరికా మరియు యురోపియన్ యునియన్
(మొత్తం కలపి) ఈ రెండు కలసినా కూడా మన కంటే తక్కువే.
.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో
ఎన్నికలు జరపడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.
ఖచ్చితంగా కాదు.
.
ఈ ఎన్నికల కోసం ఈసారి 5000 కోట్లు
కమీషన్ ఖర్చు పెట్టబోతుంది..
అంటే ధనవంతుల దేశంగా పిలిచే అమెరికా కంటే ఎక్కువే
.
దాదాపు 10 లక్షలపైగా ఉద్యోగులని
ఈ ఎన్నికల్లో కమీషన్ వాడుకోబోతుంది.
వీటికి భద్రతాదళాలు అదనంగా ఉంటారు.
.
మన దేశ ఎన్నికల గొప్పదనం ఏంటంటే..
ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలలోని కొండ కోనల్లో
ఒక ఇల్లు ఉన్నా కూడా అక్కడికి EVM మెషీన్
తీసుకెళ్ళి వారితో ఓటు వేయించి తీసుకొస్తారు.
ప్రజాస్వామ్యంలో ఓటు గొప్పదనం అమలు చేసే
అతి పెద్ద బాధ్యత తీసుకునేది ఎన్నికల కమీషన్ మాత్రమే.
.
ఇది ఒక స్వతంత్ర్య వ్యవస్థగా..
న్యాయస్థానం అధికారాలు కూడా కలిగి ఉంటుంది.
అందుకే వారు జవాబు చెప్పేది ఇద్దరికే
ఒకరు రాష్ట్రపతి రెండు న్యాయస్థానం.
.
అయితే ఇలాంటి ఎన్నికల కమీషన్
తరచూ వివాదాలకి అవ్వడం..
రాజకీయ జోక్యాన్ని సహించడం లేదా లొంగిపోవడం
లేదా ఒక పార్టీకి ఒక నాయకుడికి కొమ్ము కాయడం
నిజంగా జరిగితే ప్రజాస్వామ్యం నిజంగా ప్రమాదంలో పడినట్టే.
.
ఎన్నికల కమీషన్ పనే
ఎన్నికలు సజావుగా స్వేచ్చగా నిర్వహించడం.
వారికి ప్రతి ఏడాది ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటాయి?
ఎలా నిర్వహించాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది.
ఓటర్ల నమోదు అనేది కూడా ఒక నిరంతర ప్రక్రియ.
.
మరి ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయని
తెలిసి ఓటర్ల జాబితాలో ఓట్లు లేకపోవడం..
ఎన్నికల రోజుకు EVM పనిచేయకపోవడం..
మాక్ పోల్ లో EVM మెషీన్ లు చెక్ చేయకుండా
డైరెక్ట్ గా ఎన్నికలు నిర్వహించడం..
వాటిని సమయానికి Replace చేయకపోవడం.
Back up లేకుండా ఉండకపోవడం..
పై అధికారులకి సమయానికి సమాచారం అందకపోవడం.
వెరసి ఈ రోజు తెల్లవారుఝామున మూడుగంటల వరకు
పోలింగ్ జరగడం స్వతంత్ర్యభారత ఎన్నికల చరిత్రలో ఒక మచ్చే.
.
వారికీ సిబ్బంది కొరత కావచ్చు..
సమాచార లోపం కావచ్చు..
లేక మరో టెక్నికల్ కారణం కావచ్చు.
అంతిమంగా ఓటరుకి న్యాయం
చేయాల్సింది ఎన్నికల కమీషన్ మాత్రమే.
.
అయితే ఎన్ని కోట్లమందికి సజావుగా సక్రమంగా
ఎన్నికలు నిర్వహించడం అనేది కూడా ఒక సవాలే.
దాదాపు 46 వేల EVM మెషీన్ లలో 300 మెషీన్ లు
మొరాయించడం అంటే వీటిపై తప్పకుండా
ఎన్నికల సంఘం దృష్టిపెట్టాల్సిన అంశం.
ఇక ఎన్నడూ లేనిది 80% ఓటింగ్ నమోదు అవ్వడం
ఓటర్లలో వచ్చిన చైతన్యం కావచ్చు..
స్వచ్చంద సంస్థలు చేసిన ప్రచారం కావచ్చు..
ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు కావచ్చు
ఇవన్నీ కూడా ప్రజలు ఓటు వేయడానికి కారణాలు.
.
ఈసారి VV ప్యాట్ అంటూ తీసుకొచ్చిన
ఒక విప్లవాత్మకమైన మార్పు ఓటర్లకి తమ ఓటు
ఎవరికీ వేశారో అక్కడే తెలుసుకునే చేయడం
తప్పకుండా ఎన్నికల కమీషన్ ని అభినందించదగ్గదే
.
ప్రతి ఏడాది ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా
EVM ఎందుకు మొరాయిస్తున్నాయో..
ఎందుకు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ అందుబాటులో ఉంచరో
లేక ఒక EVM బ్యాక్ అప్ కింద ఎందుకు
ఉంచరో నాకు ఇప్పటికి అర్ధం కాదు.
.
అయితే ఉదయం నుండి EVM పనిచేయకున్నా
సాయంత్రం వరకు ఎదురుచూసి ఎంత రాత్రైనా మేము
ఓటువేసే వెళతాం అని ఘంటాపదంగా చెప్పిన ఓటర్ల
చైతన్యానికి వారి బాధ్యతకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.
ఎన్నికల కమీషన్ ఎవరి ప్రలోభాలకి లొంగకుండా
తప్పులని సరిదిద్దుకుంటూ ఓటర్లకి మరింత ఈజీగా
వేసే సౌకర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ ఒక సగటు ఓటరు.

About The Author