కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం…


కాళ్ళకి పట్టీలు,మెట్టెలు

కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:
కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..
ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..
ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.
అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి. ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.
గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది. అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

About The Author