నేటి ధరిత్రి దినోత్సవం గొప్పదనం గురించి తెలుసుకుందాం..!!
ధరిత్రి దినోముత్సవమును ఏప్రిల్ 22న జరుపుకొంటారు..
ముఖ్యముగా భూమి గురించి తెలుసుకోవటానికి ఈ రోజును నిర్ణయించారు..
U.S. గేలార్డ్ నెల్సన్
(డి-విస్కాన్సిన్) ఒక పర్యావరణ టీచ్-ఇన్ సందేశంతో 1970 లో ఆరంభించారు..
దీనిని ప్రతిసంవత్సరం చాల దేశాలు జరుపుకొంటున్నాయి..
ఈ తేదీ ఉత్తర అర్ధగోళంలో వసంతఋతువులో రాగా,
దక్షిణ అర్దగోళంలో ఇది శరదృతువులో వస్తుంది
.
చాలా నగరాలు ధరిత్రి దినము
పాటించటాన్ని ఒక వారానికి పొడిగించారు..!!
సాధారణంగా ఏప్రిల్ 16 తో మొదలయ్యి భూమిదినము ఏప్రిల్ 22 తో ముగుస్తాయి..!!
ఈ కార్యక్రమాలు పర్యావరణముతో నడుచుకోనే విధానమును ప్రోత్సహించటానికీ,
దీనిలో వ్యర్ధపదార్దాలను తిరిగి ఉపయోగించటాన్ని పెంచటం,
శక్తి సామర్ధ్యాన్ని పెంపొందించటం
మరియు పారవేసే పదార్ధాలను తగ్గించటం దీని ముఖ్య ఉద్దేశ్యం..!!
.
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి.
ఈ విషయం అందరికీ తెలిసిందే.
మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి
అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం..!! పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు
కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు..!!
ఇందుకోసం అవగాహన అవసరం..!!
అటు పర్యావరణం, వాతావరణంతో పాటు
ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన
కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి..!!
ఈ క్రమంలోంచి వచ్చిందే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’.
ప్రపంచవ్యాప్తంగా 175 కంటే ఎక్కువ
దేశాల్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు..!!
.
మన భవిష్యత్ మనచేతిలోనే…
.
విశ్వంలో మానవజాతిలాంటి జీవులు కలిగి వున్న ఒకే ఒక గ్రహం ధరిత్రి..!!
దీనిపై జీవావిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది.
ధరిత్రి ఇప్పటిస్థితికిి చేరడానికి దాదాపు
460 కోట్ల సంవత్సరాల కాలం పట్టింది..!!
విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నో చర్యలు కొనసాగుతున్నాయి. ధరిత్రిలో ని అన్ని జీవాలను పలుమార్లు పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు అమెరికా, రష్యా వంటి పలుదేశాల దగ్గరున్నాయి..!!
వీటిని సమకూర్చుకోడానికి మరికొన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్నాయి..!!
.
భూమి బాగుంటేనే భవిష్యత్తు..
.
నేల తల్లి బాగుంటేనే…
ఆ తల్లి బిడ్డలమైన మనం బాగుంటాం..!! అటువంటి తల్లి ఆరోగ్యాన్నే హరించే పనులు మనం చేస్తుంటే?
ఇంకేముంది…భవిష్యత్తు అంధకారమే..!
ఈ హెచ్చరికనే ధరిత్రి దినోత్సవం (ఏప్రిల్ 22) మరోసారి గుర్తు చేస్తోంది..!!
అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని
నిలువరించాలన్న బృహత్తర లక్ష్యంతో ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం..!!
ప్రకృతి నియమా లకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూగోళం అమితంగా వేడెక్కిపోతోంది..!!
శిలాజ ఇంధనాలను విచ్చలవి డిగా వాడడం వల్ల వాయుకాలుష్యం పెచ్చుమీరుతోంది..!!
పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న
వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది..!!
వ్యవసాయంలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పదికాలాలపాటు
పదిలంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మార్చుతున్నాం..!!
.
రసాయనిక ఎరువులతో పెనుప్రమాదం..
.
నేల అంటే నిర్జీవ పదార్థం కాదు..!!
లక్షలాది సూక్ష్మజీవులు, పోషకాలతో కూడి ఉండేదే సుసంపన్నమైన నేల..!!
దురదృష్టవశాత్తూ, వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న
రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చేస్తున్నాయి..!!
జీవం కోల్పోయిన నేలలో దిగుబడులూ నాసిగానే ఉంటాయి..!!
దీర్ఘకాలంలో దిగుబడులు మరీ తగ్గిపోయి ఆహార సంక్షోభాలకు దారితీసే
ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆలివర్ డి షుట్టర్ గుర్తించారు..!!
పర్యావరణ అనుకూల వ్యవసాయ
విధానాల వైపు మళ్లడం తప్ప మరో మార్గం లేదని నివేదించారు..!!
వ్యవసాయంలో రసాయనాలు వాడే విధానాలను ప్రపంచవ్యాప్తం
చేయడంలో కీలకపాత్ర వహించింది అమెరికా..!!
ధరిత్రి దినోత్సవం పేరిట పర్యావరణ పరిరక్షణ
ఉద్యమం కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం విశేషం..!!
41 ఏళ్ల క్రితం ఏప్రిల్ 22న గేలార్డ్ నెల్సన్ నేతృత్వంలో
కాలుష్యకారక విధానాలకు నిరసనగా జనం ఉవ్వెత్తున ఉద్యమించారు..!!
అప్పటి నుంచీ సుస్థిర అభివృద్ధి కోసం ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం..!!
ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల పర్యావరణ అనుకూల చర్యలను
చేపట్టాలన్నది ఈ ఏడాది ధరిత్రి దినోత్సవ నెట్‌వర్క్ లక్ష్యంగా ప్రకటించింది..!!
.
మనమేం చేద్దామంటే…
.
ఈ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ధరిత్రీ పర్యావరణ పరిరక్షణకు
మీవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారా?
అయితే, పెద్దపెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోనక్కరలేదు..!!
మన రోజువారీ అలవాట్లు, కార్యక్రమాల్లో కొన్నింటిని మార్పు చేసుకుంటే చాలు..
అవి తెలుసుకోండి..!!
.
?బయటికెళ్ళేందుకు కారును కాకుండా
నడిచి వెళ్ళడం లేదా బైక్ రైడింగ్‌ను ఎంచుకోండి.
?పలుమార్లు కారులో ప్రయాణించకుండా ఇతరులతో కలిసి పనులు పంచుకోండి.
?మాంసాహారానికి దూరంగా ఉండండి. తద్వారా కార్బన్ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించండి.
?పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించండి.చెత్తను ఎప్పటికప్పుడు తొలగించండి
?పునర్వినియోగానికి ఉపయోగపడే
వాటర్ బాటిల్స్, బ్యాగ్‌లనే ఉపయోగించండి.
?అవసరం లేనప్పుడు విద్యుత్ బల్బులను ఉపయోగించద్దు
?బిల్లులను తీసుకోవడం, కట్టడం ఆన్‌లైన్‌లోనే చేయండి
?స్థానిక మార్కెట్‌లోనే షాపింగ్ చేయండి, స్థానికంగా దొరికే ఆహారాన్నే వినియోగించండి
?సాధ్యమైనంత వరకూ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండే వస్తువులనే ఉపయోగించండి
?డిస్పోజబుల్ ప్యాకేజీలకు దూరంగా ఉండండి.
?మన ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మానవాళి పురోగమన చర్యలకు తోడ్పడండి. ధరిత్రి పరిరక్షణకు స్ఫూర్తిని పెంచుకోండి..!!
.
మనం చేయగల పనులు
అన్నీ చేసి ధరిత్రిని కాపాడుకుందాం..!!
పైన చెప్పిన వాటిలో నేను కొన్ని చేస్తున్నాను..!!
మరిన్ని చేయాలని ప్రయత్నిస్తాను..!!
.
ఎందరో గొప్పవారు పచ్చదనం కోసం
కృషి చేస్తూ వారి జీవితాన్నే త్యాగం చేస్తున్నారు..!!
అందులో మన FB మిత్రుడు GreenArmy Sanjai వారం వారం తనవంతుగా కాకినాడలో
ఎన్నో మొక్కలని నాటుతూ పర్యావరణాన్ని పెంచుతూ తన బాధ్యతని నెరవేరుస్తున్నారు..!!
.
అలాంటి ఎందఱో మహానుభావులందరికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను..!!