ఉమామహేశ్వరం… శ్రీశైలం ఉత్తర ద్వారం…
మహబూబ్ నగర్ జిల్లా,అచ్చంపేట మండలం, రంగాపూర్ గ్రామానికి సమీపంలో నల్లమల్ల అడవులలో ఎత్తైన కొండలపై వెలసిన క్షేత్రం ఉమామహేశ్వరం.
శ్రీశైలం నకు నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు కలవు.అవి
1 తూర్పుద్వారం-. త్రిపురాంతకం. (ప్రకాశం జిల్లా)
2.పడమర ద్వారం-. అలంపూర్ (మహబూబ్ నగర్ జిల్లా)
3.దక్షిణ ద్వారం- సిద్దవటం. (కడప జిల్లా)
4.ఉత్తర ద్వారం– ఉమామహేశ్వరం (మహబూబ్ నగర్ జిల్లా).
రావణ సంహరం అనంతరం బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడటానికి గానూ శ్రీరాముడు శ్రీశైలమల్లిఖార్జునుని దర్శనార్ధం వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ఉమామహేశ్వరులను దర్శించినారని ప్రతీతి.
శివుని కోసం తపస్సు చేసిన పార్వతిదేవికి శివుడు ప్రత్యక్షమై ,అమ్మవారితో కలసి తపస్సుచేసిన ప్రాంతం ఉమామహేశ్వరం.
పచ్చని ప్రకృతిలో,ఎత్తైన కొండలతో చాలా రమనీయంగా ఉంటుంది ఈప్రాంతం. ఒక రకమైన నిశ్శబ్ధం మనలను ఎక్కడికో తీసికొనిపొతుంది అంత బాగుంటుంది ఈ ప్రదేశం.
కొండలపై నుండి జాలువారే నీటిదృశ్యాలు ప్రకృతి ప్రియులకు కనువిందుచేస్తాయు. శివపార్వతులు, ఋషులు ఇచ్చట తపస్సు చేసారనడానికి వేరే ఆధారాలు
అవసరంలేదు,అన్నట్లుగా ఉంటుంది ఈ ప్రాంతం.
విశేషం===గర్భగుడిలోని శివలింగం ఒకవైపు గోధుమ వర్ణం లోనూ,మరోక వైపు నలుపు వర్ణంలోనూ ఉండటం ఇక్కడ విశేషం.
రూట్– మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట బస్టాండ్ లో దిగాలి.అక్కడ నుండి బస్సులు ఉంటాయు.
దేవాలయం వద్ద రెండు గదుల సత్రం మాత్రమే వుంది.పర్వదినాలలో తప్ప ఖాళీగానే ఉంటుంది. లేదా కొద్ది దూరంలో ఉన్న అచ్చంపేట లో హొటల్స్ కలవు. దేవాలయం వద్ద ఏమీ దొరకవు.
హర హర మహాదేవా. శంభో శంకర.