అన్నవరం ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు…


స్వామివారి ప్రసాదం, సేవలకు దక్కిన గౌరవం

తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్‌వో గుర్తింపు దక్కింది. సత్యదేవుని ప్రసాదంతో పాటు, ఆలయంలో అందుతున్న సేవలకుగానూ 2 విభాగాల్లో ఈ గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికెట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ శివయ్య ధ్రువీకరణ పత్రాలను దేవస్థానం ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, ధర్మకర్తల మండలి సభ్యులకు ఆదివారం అందించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల విభాగంలో ISO 22000 :2005 గుర్తింపు దక్కింది. ఆలయంలో అందుతున్న సేవలు, పనితీరు, స్వచ్ఛతా ప్రమాణాలకు ISO 9001 :2015 గుర్తింపు వచ్చింది.

About The Author