ఈ గుడి ద్వాపరయుగం నాటిది… (దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుంది)


ఈ గుడి ద్వాపరయుగం ( దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు.)

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్ళేదారిలో దివిలికి ఒక కిలోమీటరు దూరంలో తొలి తిరుపతి అనే ఊరు ఉంది. సామర్లకోటనుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు. గుడికి బయట ఒక ఫ్లెక్సీ బోర్డ్‌మీద తొమ్మిదివేల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది అని రాసి ఉంటుంది. దేవాలయం పురాతనంగానే కనిపిస్తుంది కానీ మరీ అంత పాతది కాదేమో అనే సందేహంకూడా కలుగుతుంది. కొతమంది అభిప్రాయం ప్రకారం కలియుగం మొదలై సుమారు 5000 సంవత్సరాలు అయ్యిందని. అంటే ఈ దేవాలయం ద్వాపరయుగం నాటిదన్నమాట!

తొలితిరుపతి దేవాలయం యొక్క స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేదని, దృవుడు ఇక్కడ విష్ణుమూర్తికోసం తపస్సుచేశాడని చెపుతారు. ఇక్కడొక చిన్న లింక్ మిస్సయ్యింది. దృవుడు తపస్సుచేసిన మధూవనం యమునా నది సమీపంలో ఉంటుందని పురాణంలో చెప్పబడి ఉంది. కానీ ఇక్కడ యమునా నది లేకపోవడమే మిస్సయిన లింకు. దృవుడికథ విష్ణుపురాణంలోను, బగవత్‌పురాణంలోనూ ఉంటుంది. ఉత్తానపాదుడనే రాజుగారికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ఆయనకి సునీతి ద్వారా దృవుడు, సురుచి ద్వారా ఉత్తముడు అనే కుమారులు కలుగుతారు. రాజుగారికి సురుచి అంటే ప్రేమ మెండు. అమెకీ, ఆమె కుమారుడికీ ముద్దుమురిపాలన్నీ దక్కేవి. ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా చూసిన దృవుడు తానుకూడా తండ్రి ప్రేమను అదేవిధంగా పొందాలని భావించి ఒడిలోని ఎక్కబోతుండగా అతని సవతి తల్లి సురుచి అతడిని నిందిస్తుంది. బాధపడుతున్న దృవుడిని చూసి తల్లి సునీతి విష్ణువుని గూర్చి తపస్సు చేసి తండ్రిప్రేమని పొందే వరంకోరుకోమంటుంది. అప్పుడు దృవుడు యమునా నది తీరంలో ఉన్న మధూవనం అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సుచేసి విష్ణువుని ప్రసన్నం చేసుకొంటాడు.

పిల్లవాడైన దృవుడు దేవుడి తేజస్సుచూసి భయపడ్డాడని, అప్పుడు విష్ణువు దృవుడి అంత పొడవుతో కనిపించి, చిరునవ్వుతో అతని చెంపలు నిమిరాడని, ఆకారణంగానే ఇక్కడిస్వామి చిరునవ్వులు చిందిస్తూ శృంగార వల్లభ స్వామిగా పిలవ బడుతున్నాడని, ఎవరుఎంత పొడవు వుంటే అంత పొడవుగానే కనిపిస్తాడని చెపుతారు. శృంగార వల్లభ స్వామి అంటే వేంకటేశ్వరుడే. అన్నిచోట్లా ఆయన కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ఉంటాయి. కానీ, ఈ దేవాలయంలో అవి అది ఇటు, ఇది అటు మారి ఉంటాయి. మరొక ప్రత్యేకత ఇది. స్వామివారి దేవేరులైన శ్రీదేవిని నారదమహర్షి, భూదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టించారట. స్వామివారికి వెండితొడుగు విక్టోరియా మహారాణి భహూకరించినదట.

దేవాలయానికి వెనుకవైపు ఉన్న నూతిలో నీటిని తలపై జల్లుకొని, స్వామివారిని కోరుకొంటే, ఆయా కోరికలన్నీ నెరవేరుతాయట. శృంగార వల్లభ స్వామికి పటికబెల్లం అంటే ఇష్టంకాబట్టి కోరికలు నెరవేరిన భక్తులు పటికబెల్లాన్ని స్వామివారికి సమర్పిస్తారు.

About The Author