తిరుమల నందు మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పరిశీలించిన గవర్నర్…


? తిరుమల నందు మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పరిశీలించిన గవర్నర్,
? దేవుడు ఇక్కడ వున్నాడు.
? అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాట్లు బాగున్నాయి.
? భోజనం ఎక్సలెంట్ గా ఉంది : తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌ : శ్రీ ఈ. ఎస్ ఎల్. నరసింహన్ గారు.
తిరుమల, ఏప్రిల్ 23 : తిరుమల కు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న భక్తులు రుచికరమైన
భోజనం చేస్తున్నారని ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల గవర్నర్ గౌ.శ్రీ ఈ.ఎస్. ఎల్.నరసింహన్ గారు పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి తిరుమల దేవస్థానం తిరుమల నందు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేసిన గవర్నర్, అనంతరం భోజన శాల, వంటశాల ను పరిశీలించారు.ఈ సందర్భంగా గవర్నర్ విలేఖరులతో మాట్లాడుతూ దేవుడు ఇక్కడ వున్నాడు,వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఎంతో భక్తితో తిరుమల కొండకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని అనంతరం ఇక్కడ భోజనం చేయడం వల్ల భక్తులకు ఆనందంగా ఉంటుందని తెలిపారు.శ్రీవారిని దర్శించుకొని భోజనం చేసి ఆనందంగా వెళ్ళతరని తెలిపారు. ఆకలిగా ఉన్న వారికి అందరికి భేదం లేకుండా అందరికి సమానంగా,అందరికి ఒకే రకమైన భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. భోజనం చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందని తెలిపారు. అన్నప్రసాద కేంద్రంలో ఏర్పాట్లు వివరాలను క్యాన్ట్ ఇన్ చార్జీ అధికారి శాస్ర్తీ గవర్నర్ కు వివరించారు. అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చాలా బాగుంది,చాలా చక్కగా ఏర్పాట్లు టిటిడి అధికారులు చేస్తున్నారని తెలిపారు.

About The Author