పద్మావతి నిలయం కర్చు సుమారు 75 కోట్లు…
*పద్మావతి నిలయం నిర్మాణం
2014 సంవత్సరం ప్రారంభమయి దాదాపు నాలుగు సంవత్సరాలుగా నిర్మాణం చేపట్టారు.
*తితిది పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌకర్యార్థం ఆలయానికి అత్యంత సమీపాన చిత్తూరు రేణిగుంట జాతీయ రహదారికి ప్రక్కన అత్యద్భుతంగా భవన నిర్మాణం చేపట్టారు.
*భక్తులకు సేదతీరడానికి విశాలవంతమైన గదులు,లాకర్లు,మొబైల్ కౌంటర్,ఏటియమ్ సెంటర్,నేరుగా తిరుమలకు ప్రయాణ సౌకర్యం మొదలగు వసతులతో
ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భవనం 2018 డిసంబర్ చివరికి నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికి..ఇంతవరకు భక్తులకు అందుబాటులోకి రాకపోవడంతో తితిది తీరు పట్ల భక్తులకు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.
*గత సంవత్సరం డిసంబర్ లో భవన నిర్మాణం పూర్తి అయిన తరువాత ఫిబ్రవరి 2 వతారీకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదిగా ప్రారంభం కానున్నట్లు తతిది ప్రకటించారు.అయితే పద్మావతి నిలయం ఆతారీకు ప్రారంభం కాలేదు .అనంతరం తితిది అదే నెలలో నాలుగు సార్లు భవన పారంభోత్సవ తేదీలు ప్రకటించి విఫలం కావడం తీవ్ర విమర్శలకు తావుకల్పించింది.
*ఈ పద్మావతి నిలయంలో ఒక్సారిగా 2000 మంది భక్తులకు సౌకర్యాలు కలగించనుండడం విశేషం.