రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన…
హిందూమహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో 3.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని ప్రభావం వలన హిందూమహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో శ్రీలంకకు ఆగ్నేయ దిశగా రేపు(ఏప్రిల్ 25 వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 36 గంటలలో ఇది వాయుగుండముగా మారి శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపుకు ప్రయాణించి తదుపరి 48 గంటలలో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది.
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
————————-
తెలంగాణ:
ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
—————————–
కోస్తా ఆంధ్ర:
రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
—————————
రాయలసీమ:
రాగల మూడురోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
——————————
హైదరాబాద్ వాతావరణ కేంద్రం.