మహిళలే మా బలం టీడీపీ విజయం తథ్యం… మంత్రి అమరనాథ్ రెడ్డి…


మహిళలే మా బలం టీడీపీ విజయం తథ్యం
చంద్రబాబు నాయుడును ప్రతిపక్షాలు వ్యతిరేకించేందుకు కారణాలు లేవు
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నది చంద్రబాబు నాయుడు…మంత్రి అమరనాథ్ రెడ్డి

రాష్ట్రంలోని మహిళలే మా బలం టీడీపీ విజయం తథ్యం అని మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో తేదేపా ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకం అమలు, పోలవరం డ్యాం, పసుపు కుంకుమ, మొదలగు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేసినందుకు ప్రతిపక్షాలు నచ్చకనే చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు. రాయలసీమ జిల్లాలు ఎడారి కాకూడదని దాదాపు 30 సంవత్సరాల కల హంద్రీనీవా ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను తెచ్చారని అన్నారు. అదేవిధంగా దాదాపుగా 18 సార్లు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎన్నికలు చూశానని, అయితే 2019 ఎన్నికలు లోపభూయిష్టంగా ఈసీ నిర్వహించారని విమర్శించారు. అదేవిధంగా ఈవీఎంలు పనిచేయకపోవడం, ఓటర్లకు సరైన సౌకర్యాలు కల్పించడం, ఎన్నికల నిర్వహిస్తున్న బూతులు వద్ద సరైన భద్రతా బలగాలు ఏర్పాటు చెయ్యడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని అన్నారు.
ప్రతిపక్ష నాయకుడు ఆదేశానుసారమే రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు నిర్వహించారని అన్నారు.
మండలంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ఆదేశానుసారం పని చేస్తే మండలంలో, అదేవిధంగా నియోజకవర్గంలో తెదేపా పార్టీకి తిరుగుండదని అన్నారు. అదేవిధంగా మండల నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో తీవ్ర త్రాగు నీటి కొరత ఉన్నదని గ్రామ ప్రజలకు అవసరమైన నీటిని మన నాయకులే సరఫరా చేసి గ్రామాల్లోని ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేయాలని, నీటి సమస్య పరిష్కారానికి నేరుగా నన్ను కలవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు జి. నాగరాజు, ఎంపీపీ మురళీకృష్ణ, టిడిపి మండల అధ్యక్షుడు శ్రీ రాములు, టిడిపి జిల్లా కార్యవర్గ సభ్యుడు రోజా కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ముబారక్ తాజ్, మండల నాయకులు సుధాకర్ రెడ్డి, డి. క్రిష్ణారెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author