బంగాళాఖాతంలో అల్పపీడనం…’ఫణి’ గా నామకరణం..
36 గంటల్లో తుఫాను గా మారే అవకాశం..
దక్షిణ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. మధ్యాహ్నం లోపు అల్పపీడనం వాయుగుండంగా మారింది. 36 గంటలు గంటల్లో వాయుగుండం తుఫాన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది..
ఈ తుఫాను కు ఫణి అని నామకరణం చేశారు.దీని ప్రభావం తమిళనాడు పై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈనెల 27వ తేదీ నుండి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈనెల 30 న తుఫాను తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో కన్యాకుమారి తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రెడ్ ఎలెర్ట్ రైతులు ముందు జాగ్రత్తలు వహించండి
ఆంధ్రప్రదేశ్ ముంగిట నిలుచున్న ఫణి తుఫాను..
నడి వేసవిలో అటు తిరిగి ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశం..
ఈ తుఫాను సముద్రం తీర ప్రాంతం గుండా పయనించే అవకాశం..
ఎక్కువ మోడళ్లు కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉనట్లుగా చూపిస్తున్నాయి..
ఇదే జరిగితే.మే.2,3 వ తేదీల్లో తీరం వెంబడి విపరీతమైన గాలి ప్రభావం అలానే అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయు..
కనుక ముక్యంగా సముద్రం లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు 30 వ తేదికల్లా తీరానికి చేరడం మంచిది..
వాతావరణ అంచనా ప్రకారం గాలుల తీవ్రంగా ఉంటాయి
100 కిలోమీటర్ల నుండి 180 కిలోమీటర్ల వరకు తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచే అవకాశం..
బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ల గమనం కచ్చితంగా అంచనా వేసే వ్యవస్థ ఇంకా ఏర్పాటు కాలేదు..
కనుక 30 వ తేదికల్లా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది..
ఇక తుఫాను గోదావరి జిల్లాలో తీరం దాటితే..
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత మ్ అంతా ముఖ్యంగా గుంటూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..
మమకున్న పరికరాలు యాప్ లు ఇచ్చే సమాచారం బట్టి ఇప్పటికున్న సమాచారం..