మే 9న భద్రాద్రిలో శ్రీరాముడి ఊరేగింపు…


55 ఏళ్ల తర్వాత మళ్లీ ఏనుగుల అంబారీపై శ్రీరాముడి ఊరేగింపు
భద్రాద్రి పుణ్యక్షేత్రంలో మే 9న *‘శ్రీరామ విజయం* ’ పేరిట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని అహోబిల రామానుజ జీయర్‌ స్వామి తెలిపారు. ఈ మేరకు చిన జీయర్‌ స్వామి ఆశీస్సులు అందించారన్నారు. శనివారమిక్కడ స్థానిక జీయర్‌ మఠంలో పలువురు ప్రముఖులతో సమావేశమైన అనంతరం శోభాయాత్ర వివరాలను ఆయన వెల్లడించారు. చిన జీయర్‌స్వామి గురువైన పెద జీయర్‌ స్వామి నేతృత్వంలో 55 ఏళ్ల కిందట ఇక్కడ ‘రామాయణ క్రతువు’ నిర్వహించి ఏనుగులతో రాముడికి తిరువీధి సేవ చేశారని గుర్తుచేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ ఉత్సవాన్ని నిర్వహించే భాగ్యం కలిగిందన్నారు. ఈ నెల 13 నుంచి జీయర్‌ మఠంలో చేపట్టిన క్రతువు వచ్చే నెల 10న ముగుస్తుందని దీనికి ముందు రోజు 9న ఏనుగుల అంబారీపై రాజవీధిలో రాముడి సేవ ఉంటుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది భక్త బృందాలు తరలి వచ్చి దేవుణ్ని కీర్తించనున్నాయని చెప్పారు.?? *శ్రీ రామ జయ రామ జయ జయ రామ* ??

About The Author