మాజీ ముఖ్యమంత్రి… కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనం నిజంగా రుణపడి ఉన్నాం …
అతను ముఖ్యమంత్రి గా పని చేసిన మూడున్నర సంవత్సరాలలో గ్రూప్ 1 , గ్రూప్ 2 గ్రూప్ 4 , ఒకసారి ఎస్ ఐ 2 సార్లు constable ,VRO ,VRA ,పంచాయితీ సెక్రటరీ , జైలు వార్డర్లు , excise CONSTABLE , DSC , AE ,AEE ఇంకా ఎన్నో ఉద్యోగ నియామకాలు చేసారు …మరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది దేని కోసం …ఉమ్మడి రాష్ట్రము లో నష్టపోయామా లేక సొంత రాష్ట్రము లో నష్టపోతున్నామా ? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని సమస్యలు .. ఒకవైపు జగన్ మరోవైపు కెసిఆర్ ,ఇంకోవైపు ఒవైసి బ్రదర్స్ ,ఓయూ లో బలిదానాలు .. ఇలా ఎన్నో సమస్యలు పెట్టుకొని కూడా అన్ని ఉద్యోగాలు భర్తీ చేసాడంటే ఎవరు గొప్ప ముఖ్యమంత్రి?… పక్క రాష్ట్రము కిరణ్ కుమార్ రెడ్డి నా లేక సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నా?… లేక ఈ ఉద్యోగాలు అన్ని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడా కిరణ్ కుమార్ రెడ్డి ??
నిజమే… తెలంగాణా ప్రజలు సమైక్యరాష్ట్ర ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నారు….. ఆయన హయాంలో 1,60,000 ఉద్యోగ కాళీలని గుర్తించి , 1,30,000 భర్తీ చేశారు…. అంతేకాదు దాదాపు 84,000 కొత్త ఉద్యోగాలను సృష్టించారు…… ఇంత పెద్దసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికి ఎలాంటి వివాదాలు లేకుండా, పారదర్శకంగా వ్యవహరించారు. అయితే, విభజఉద్యమం ఉదృతం గా ఉండటం వలన ఆయన నిరుద్యోగ యువతకు కల్పించిన అవకాశాలు ప్రచారంలోకి రాలేదు….అధికార దర్పం తలకి ఎక్కితే ఎలా బుద్ది చెప్పాలో ప్రజలకి బాగా తెలుసు ..
సమయం: 2013.
తెలంగాణ ఏర్పాటుకు C.W.C ఆమోదం. అదే సమయం లో
50 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యంమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం. అందులో Group 1 Group 2, Junior Lecturers, Degree Lecturers, S.I, Police Constables, DSC లాంటి అనేక ఉద్యోగాలు ఉన్నాయి.
వీర తెలంగాణ వాదులు, జే.ఏ. సి వాళ్ళు, TRS వాళ్లు అందరు సమైక్య రాష్ట్రము లో ఉద్యోగాల భర్తీ వద్దు. మన తెలంగాణ ఎలాగూ వస్తుంది…. తెలంగాణ వచ్చాక ఒక్క నెలలో లక్ష ఉద్యోగాలని భర్తీ చేస్తాం అని అడ్డుకున్నారు. సరే లే ఎలాగూ తెలంగాణ వస్తుంది…. నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి అనుకున్నాం.
ఇప్పుడు 2019 ఏప్రిల్. తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. తెలంగాణ లో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మందికి తెలంగాణ వచ్చాక మిగిలింది నిరాశ, నిస్పృహలే…. ఏ తెలంగాణ కోసం ఐతే కలలు కన్నామో అదే తెలంగాణ వచ్చాక ఆశలు ఆవిరి అయ్యాయి…. Telangana వద్దు విభజన వల్ల నష్టపోతాం అన్న వాళ్ళకి పెద్ద పెద్ద నోటిఫికేషన్ లు గ్రూప్ 2 లో 925, గ్రూప్ 1 లో 94, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్, పంచాయతీ సెక్రటరీ, రెండుసార్లు డీఎస్సీ ద్వారా 20 వేల టీచర్ పోస్టుల భర్తీ, ఇంకో 10 నోటిఫికేషన్లు వచ్చి వేల ఉద్యోగాలు ఇస్తుంటే….. తెలంగాణ లో ఎం జరుగుతుంది. నోటిఫికేషన్లు రావు వచ్చినవి కోర్టులకు పోకుండా జరగవు….. ఏంది సార్ ఈ బాధలు…..
మన రాష్ట్రము మనకి వస్తే న్యాయం జరుగుద్ది నియామకాల్లో అన్యాయం జరుగుతుంది మా రాష్ట్రము మాకు కావాలి అని పోరాడిన వాళ్లకి నేడు మిగిలింది ఏడుపే….. ఏవో కొన్ని టెక్నికల్ పోస్ట్ ల భర్తీ మినహా జరిగింది శూన్యం.
GROUP 2 నోటిఫికేషన్ ఇచ్చారు…. ఎక్సమ్ అయ్యింది సవాలక్ష గోడవలతో చివరికి కోర్ట్ కి చేరింది. అది ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ తెలియడం లేదు.
గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియదు.
P.G చేసి అదనపు అర్హతలు ఐన Ph.d/NET/ SET లాంటివి ఉన్నవాళ్లు 2 లక్షల 50 వేల మందికి పైగా అభ్యర్థులు TSPSC దగ్గర One Time Registration చేసుకొని ఉన్నారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఎలాంటి ఎక్సమ్ లేకుండా, దొడ్డి దారిలో నియామకం ఐన Degree Lecturers, Polytechnic Lecturers, Junior Lecturers లాంటి గెజిటెడ్ ఉద్యోగాలని నిబంధనలు మార్చి యRegularisatuon చేస్తారట…. అది చేయకుండా మేము కోర్టులో అడ్డుకుంటే వాళ్ళ జీతాలు పెంచారు.
ఇదే కాంట్రాక్టు లెక్చరర్లు మమ్మల్ని రెగ్యులర్ చేయమంటే Kiran kumar Reddy గారు అలా ఎలా చేస్తాం…. చదువుకున్న వాళ్ళు బయట ఉండగా అని వాళ్లను కంట్రోల్ చేసాడు… అసలు తెలంగాణ ఉద్యమ మూలాల్లో ఒకటి ఐన నియామకాల్లో నేడు అభ్యర్థులకి జరుగుతున్న న్యాయం ఏందీ.?? ప్రభుత్వ పెద్దలారా కొంచెం మీ పార్టీ పటిష్టత కోసం పెడుతున్న సమయం లో కొద్ది సేపు ఉద్యమం జరగడానికి ముఖ్య కారణం ఐన ఉద్యోగాల భర్తీ పై శ్రధ్ధ పెట్టండి…..
#గమనిక: నేనేమి Kiran Kumar Reddy అభిమానినో, చంద్రబాబు పచ్చ పార్టీ వాన్నో , కాంగ్రెస్ పార్టీ వాన్నో కాదు. ఎవరన్నా బంగారు తెలంగాణ భక్తులు నేను తెలంగాణ ద్రోహిని అనుకుంటే నేనేమి చేయలేను….. ఎందుకంటే కోదండరాం సారె మీకు తెలంగాణ ద్రోహి అయినప్పుడు నా లాంటోడు ఎంత.
అపుడు ఉద్యమ సమయంలో ఎక్సమ్ యుద్ధానికి వెళ్లినట్టే వెళ్లి రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా ఏకామ్స్ లేవు.
నేనె కాదు చాలా మంది తెలంగాణ కోసం కొట్లాడిన నికార్సైన తెలంగాణ వాదుల అభిప్రాయం…. అప్పటి Kiran Kumar Reddy ఏ నయం అని…. కిరణ్ కుమార్ రెడ్డి కి మనం నిజంగా రుణపడి ఉన్నాం ……??
చాలా మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాడు