యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ రవాణా…


పర్మిట్లు లేకుండానే హద్దులు దాటిస్తున్నారు

మామూళ్ల మత్తులో రవాణా శాఖ అధికారులు, పోలీసులు

సహజ వనరులను మూడోకంటికి తెలియకుండానే అక్రమంగా హద్దులు దాటి చేస్తున్నారు . కంచె చేను మేసిన చందంగా అడ్డుకోవాల్సిన నిఘా వ్యవస్థను ఆమ్యామ్యా లతో నిద్రపుచ్చేశారు. తెల్ల రాయిని తరలించే అక్రమ వ్యాపారస్తుల వ్యాపారానికి రాచబాటలు వేసిమరి గ్రీన్ సిగ్నల్ తో స్వాగతాలు పలుకుతున్నారు. కళ్ల ముందే తెల్ల సరుకుతో లారీలు పోతున్న వారికి అవేమి కనిపించవు. వివరాలు లోకి వెళ్ళితే…
మండలంలోని నందివాయి ,చిట్టేపల్లి తిప్ప నుండి తెల్లరాయి లభిస్తుంది. ఈ తెల్లరాయి క్వారీల నుండి కొందరు అక్రమార్కులు ఎటువంటి పర్మిట్లి లేకుండా తెల్లరాయిని లారీల్లో నిత్యం చెన్నైకి తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు.ఎటువంటి పర్మిట్లు లేకపోయినా, వారిని ఆర్టీఓ అధికారులు, పోలీసులు, ఎవరు ఆపడం లేదు. కొండలను సైతం పిండేస్తున్నారు. ఎవరికి అందించాల్సిన ముడుపులను వారికి టంచనుగా అందిస్తూ, వారి అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ఒక్కో స్టేషన్లకు రూ 5,000 చొప్పున ఇచ్చుకుంటూ చెన్నైకి తరలిస్తున్నారు.ఇచ్చిన వారే చెబుతున్నారు. ఒక్క లారీ చెన్నైకి తరలిస్తే వారి దారి ఖర్చులు పోనూ వారికి వచ్చే లాభం అక్షరాలా ఒక లక్ష 50 వేల రూపాయలు . దీంతో తెల్లరాయి అక్రమ వ్యాపారం చేస్తున్న తెల్ల స్మగ్లర్లు దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రాత్రి సమయాలలో అధికంగా తెల్లరాయి లారీలు వెళ్తున్నాయి.

About The Author