వెంకన్న బంగారం వపాసు వచ్చినది…
తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన బంగారం తమిళనాడు లో ఎలక్షన్ కమీషన్ వారు స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.దీనిని అదనుగా తీసుకుని వారి స్వలాభం కొరకు మన ఉన్నత అధికారులను అర్థం లేకుండా కొంత మంది స్వామిజీ లు,ఇతరులు దూషించడం జరిగింది.వీటన్నటికీ దీటుగా టీటీడీ కార్యనిర్వహణాధికారి క్లుప్తంగా మీడియా ప్రతినిధులకు, భక్తులుకు వివరణ ఇవ్వడం జరిగింది.అంతటితో ఎలక్షన్ కమీషన్ టీటీడీ వారిది తప్పు లేదని క్లీన్ చిట్ ఇవ్వడం మరియు స్వామిజీలు దూషించడం తప్పుగా ఒప్పుకొని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా టీటీడీ కార్యనిర్వాహణాధికారి గారు ఈ వివాదం పై వచ్చిన అభియోగాలును తనదైన శైలిలో వివరణ ఇచ్చి టీటీడీ గౌరవాన్ని,పరువు,ప్రదిష్టలను ఎక్కడా లోటు రానివ్వకుండా వ్వవహరించిన తీరు మహాఅద్భుతం.ఈ సందర్భంగా సంఘీభావం తెలుపుతన్న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పొదలపల్లి సుబ్రహ్మణ్యం,యస్.సి & యస్.టి యంప్లాయస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎ. వి.శేషగిరి, టీటీడీ యస్.సి & యస్.టి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారపు తులసిరామ్,APSCWA రాష్ట్ర మహిళా సెక్రటరీ యం.ధనభాగ్యం, సీనియర్ లీడర్ ఎ. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.