ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలకు, ఫలితాల్లోని తప్పులు కారణం కాదు… తెలంగాణ ఇంటర్ బోర్డు


ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలకు, ఫలితాల్లోని తప్పులు కారణం కాదు… తెలంగాణ ఇంటర్ బోర్డు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇంటర్‌ ఫలితాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే… అయితే ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పుల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మాత్రం నిజం కాదని తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు.

ఆత్మహత్యలకు పాల్పడిన 25 మంది విద్యార్థుల జవాబు ప్రతాలను మళ్లీ పరిశీలించామని, నిపుణుల కమిటీ కూడా ఆ 25 మంది విద్యార్థుల జవాబుపత్రాలను పరిశీలించాకే తామీ ప్రకటన చేస్తున్నామన్నారు బోర్డు కార్యదర్శి అశోక్.

12 కేంద్రాల్లో రీవెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని, ఈనెల 10లోగా ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఫలితాల తర్వాత 15రోజులకు స్కాన్‌ చేసిన జవాబు పత్రాలను ఇస్తామని అశోక్‌ తెలిపారు.

అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్ బోర్డు దగ్గర ఆందోళన చేస్తున్న విద్యార్ధుల తలిదండ్రులను ఉద్దేశించి… మాస్ హిస్టీరయాతో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని అశోక్ ఆరోపించడం తెలిసిందే…

About The Author