సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు…


విడుదలైన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు…
ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
NEWS18

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

విద్యార్థులు www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in అనే వెబ్‌సైట్‌లలో తమ ఫలితాలు చూసుకోవచ్చని సీబీఎస్‌ఈ ప్రకటించింది.

ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ పదో తరగతి-2019 ఫలితాలను ఇతర వెబ్‌సైట్లు అయిన examresults.in, indiaresults.com, results.gov.inలోనూ చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకోండిలా..

www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in సైట్‌ను ఓపెన్ చేయండి

హోం పేజీలోకి వెళ్లి ‘క్లాస్ 10 రిజల్ట్స్ 2019’ పై క్లిక్ చేయండి :

మీ రిజిస్ట్రేషన్ నంబరు లేదా రూల్ నంబరును, ఇతర వివరాలను ఎంటర్ చేయండి

ఫలితాలు స్క్రీన్‌పై చూపించాక, డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి

కాగా,సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలు గురువారం రిలీజయ్యాయి. ఆ పరీక్షల్లో 83.4% శాతం పాసైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 13 లక్షల మంది సీబీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాశారు. 10, 12 తరగతులకు మొత్తం 31,14,821 మంది నమోదు చేసుకున్నారు.

About The Author