ప్రైవేట్,కార్పొరేటు కళాశాలల్లో ఫీజుల దోపిడీ,అక్రమ అడ్మిషన్లను అరికట్టాలి…ఏఐఎస్ఎఫ్


అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో జూనియర్ ఇంటర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ , కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని తిరుపతిలోని ఆర్ ఐఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది.

ఈ సందర్భంగా గా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు బండి చలపతి, జి శశి కుమార్ లు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు . వేసవి సెలవులలో తరగతులు నిర్వహించడం వలన విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి దూరమై ఎటువంటి క్రీడలు లేకుండా ఉండటం వలన ఆహ్లాదకరమైన జీవనానికి కొల్పాయి ఆత్మహత్త్యలకు పాల్పడుతున్నారన్నారు. అదేవిధంగా ప్రవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలు అతిక్రమించి ముందస్తుగానే అడ్మిషన్లు చేసుకుని విద్యార్థులను అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. మరియు ఐఐటీ, ఐకాన్ ,ఈ స్పార్క్, మెడిసిన్ వంటి పేర్లతో అడ్మిషన్లు చేపడుతూ అధిక ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. తక్షణమే ఇలాంటి కళాశాలలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా జిల్లావ్యాప్తంగా గుర్తింపులేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలను మూసివేసి ఆ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం AISF నాయకులు ఆర్ ఐ ఓ కి వినతిపత్రం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్ కౌశిక్, ,తిరుపతి నగర అధ్యక్ష కార్యదర్సులు విజయన్,ఉదయ్ కుమార్, నాయకులు ముని,నాగరాజు , దాము,మోహన్,కోటి,హరి తదితరులు పాల్గొన్నారు

About The Author