కిడారి శ్రావణ్ రాజీనామా తప్పదా…?

అరకు ఎమ్మెల్యే గా ఉన్న కిడారి సర్వేశ్వర రావు ను మావోలు హత్య చేసిన తర్వాత, అనూహ్యంగా సర్వేశ్వరరావు కుమారుడు, కిడారి శ్రావణ్… గత ఏడాది మే 11న ఏపీ మంత్రివర్గం లోకి తీసుకొని, కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు చంద్రబాబు…

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల లో అరకు నియోజకవర్గం నుంచి, తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసారు శ్రావణ్… అయితే, ఎన్నికలు అయిపోయాక ఉత్తరాంధ్రకు చెందిన అవివాహిత డాక్టరుతో అత్యంత చనువుగా ఉండడమే కాక మంత్రిగా ప్రభుత్వం తనకు సమకుర్చిన సౌకర్యాలను వ్యక్తిగత అవసరాలకు దుర్వినియోగం చేస్తున్నారని, ఇంటెలిజెన్స్ కూడా నివేదిక ఇచ్చిందనే వార్తలు నెట్టింట గుప్పుమంటున్నాయి…

ఇవన్నీ ఒక ఎత్తు అయితే… రాజ్యాంగం ప్రకారం, ఏ చట్ట సభలలోను సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారంచేస్తే… ఆరు నెలల లోపు ఏదో ఒక చట్టసభనుంచి ఎన్నిక కావలసి ఉంటుంది, లేని పక్షంలో ఆరునెలల కాలవ్యవధి ముగిసిన వెంటనే పదవీచ్యుతుడు కావలసి ఉంటుంది…

ఈ నెల 10వ తేదీ తో కిడారి శ్రావణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు ముగుస్తుండటంతో… రాజ్‌భవన్ అధికారులు అప్రమత్తం అయ్యారు… గడువు తీరిన తర్వాత పదవిని కోల్పోవడం గౌరవ ప్రదంగా ఉండదు కావున ముందే… రాజీనామా చేయాల్సిందిగా రాజ్‌భవన్ అధికారులు సమాచారమిచ్చారు… అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు కిడారు శ్రావణ్.

About The Author