సీబీఎస్‌సీ ఫలితాల్లో వందకు వంద సాధించిన వినాయక్… అయినా ఆ తల్లి రోదనకు అంతు లేదు…

తమ పిల్లలు వ్రాసిన పరీక్షల్లో మంచి మార్కులు వస్తే సంతోషించని తల్లిదండ్రులు ఎవరుంటారు…? అందనా వందకు వందా వస్తే.. ‌ ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు… కానీ
ఇటీవల సీబీఎస్ఈ ఫలితాలలో వినాయక్ శ్రీధర్ అనే నోయిడా విద్యార్ధి తాను వ్రాసిన మూడు పరీక్షల్లో 90శాతానికి పైగా మార్కులు. ఒక సబ్జెక్ట్ లో అయితే.. ఏకంగా 100 మార్కులు సాధించాడు అయితే ఈ ఆనందాన్ని ఆశ్వాదించడానికి ఆ తలిదండ్రులకు విద్యార్ధి వినాయక్ శ్రీధర్ భౌతికంగా వారి మధ్య లేడు….

వినాయక్ శ్రీధర్ కి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు అత్యంత అరుదైన, ఇప్పటికీ నిర్ధిష్ట చికిత్స అందుబాటులో లేని మస్కులర్ డిస్ట్రోఫీ అనే జన్యుసంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు…. అప్పటి నుండి చక్రాల కుర్చీకే పరిమితమైనా‌‌‌…తల్లిదండ్రుల ప్రోత్సాహం, వినాయక్ శ్రీధర్ మొక్కవోని ఆత్మవిశ్వాసం ముందు అతని వైకల్యం తలవంచక తప్పలేదు… చదువు పై అత్యంత శ్రధ్ధకనబరిచే వినాయక్ శ్రీధర్… సీబీఎస్ఈ పరీక్షలలో తాను వ్రాసిన మూడు సబ్జెక్ట్ లలో… ఇంగ్లీషులో వందకు వంద, సైన్స్‌లో 96, సంస్కృతంలో 97 చొప్పున మార్కులు రాగా, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాయకుండానే చనిపోయాడు.

నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ పాఠశాలకు చదివిన వినాయక్ పరీక్షలను కూడా చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడీ కేటగిరీ కింద రాయకుండా సాధారణ కేటగిరీలోనే పరీక్షలు రాశాడు.

ఈ అద్భుత ప్రతిభావంతుని తల్లి మమతా శ్రీధర్ మాట్లాడుతూ… తన కుమారుడు జన్యుసంబంధిత వ్యాధితో కుర్చీకే పరిమితమైనప్పటికీ.. అతని జ్ఞాపకశక్తి మాత్రం అపారమని, అందుకే పరీక్షలను కూడా స్వయంగా తానే వ్రాశాడని చెప్పాడు…. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫిన్ హాకింగ్స్ స్ఫూర్తి గా… తన కుమారుడు కూడా తన పనులు తానే చేసుకునేవాడనీ… తాను వ్యోమగామి కావాలని పరితపించేవాడనీ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నారు.

About The Author