శ్రీకాకుళం లో ఘనంగా ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం…


రక్తదాతలను ప్రోత్సహిస్తున్న తైక్వాండో శ్రీను కు రెడ్‌క్రాస్ అవార్డు.. శ్రీకాకుళం లో ఘనంగా ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆద్వర్యంలో… అంతర్జాతీయ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు నగరంలోని బాపూజీ కళా మందిర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ జె..నివాస్ IAS, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ IAS, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

వ్యక్తిగతంగా 38 సార్లు రక్తదానం చేయడమే కాక, మెగా హీరోల పుట్టిన రోజున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ… సంవత్సరానికి 500 యూనిట్లకు పైగా రక్తాన్ని రోగులకు అందుబాటులో ఉంచి, ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టుతున్న… తైక్వాండో శ్రీనుకు రెడ్‌క్రాస్ అవార్డును అందించి సన్మానించారు జిల్లా కలెక్టర్ జె.నివాస్.

స్వతహాగా తైక్వాండో క్రీడాకారుడు, శిక్షకుడు అయిన బందిలి శ్రీనివాస శివ ప్రసాద్ కుమార్, తైక్వాండో శ్రీనుగా అందరికీ చిరపరిచితుడే.

రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ అయున తైక్వాండో శ్రీను, తన అభిమాన నటుడు చిరంజీవి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో… గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరం క్రమం తప్పకుండా… రక్తదానం చేయడమే కాక మరికొంత మందిని తన బాటలో రక్తదానం వైపు ప్రోత్సహిస్తూ… తద్వారా తన అబిమాన నటుడైన చిరంజీవి ఆశయసిద్ధికి అహరహం శ్రమిస్తన్న తైక్వాండో శ్రీను ను కలెక్టర్ జె.నివాస్ తో సహా సభకు హాజరైన పలువురు అభినందించారు. శ్రీనుని ఆదర్శంగా తీసుకొని, రక్తదానాన్ని చేయడమే కాక, తమ తోటివారిలో రక్తదానం పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చునని జగన్మోహన్ రావు పేర్కొన్నారు.

About The Author