పాలు యొక్క ఉపయోగాలు – సంపూర్ణ వివరణ…


పాలు సంపూర్ణ ఆహారం . ఆరోగ్యముగా ఉన్న ఆవు నుంచి అప్పుడే తీసిన ఆవుపాలు అమృతతుల్యమైనవి. ఈ పాలు తేలికగా ఉండి త్వరగా జీర్ణం అవుతాయి. కడుపుబ్బరం , పైత్యం , దగ్గును నయం చేయును . ఆవుపొదుగు నుంచి తీసిన పాలను వెంటనే నిలువ ఉంచకుండా తాగవలెను లేదా వేడిచేసి తాగవలెను. శుభ్రతలేని పరిసరాలలో పాలు తీసినప్పుడు ఆ పాలను మరగకాయాలి.

ఆవుపాలను ఇతర ఆహారంతో కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు . పాల యొక్క పోషకాలను గరిష్టంగా పొందాలి అంటే ప్రతినిత్యం తీసికొనవలెను. పాలను ఎక్కువ మొత్తములో తీసుకుంటే అందులోని క్యాల్షియం , ఇతర ఖనిజ లవణాలు ఉదరములోని ఆమ్లతత్వాన్ని అడ్డుకొని ఒకరకమయిన ఎంజైము ఉత్పత్తిని తగ్గించును . కడుపు మంచిగా తయారగును. పాలలో ఉండే లాక్టిన్ పేగుల్లోకి డైరెక్టుగా ప్రవేశించి బ్యాక్టీరియా చురుకుదనాన్ని తగ్గించును . కేవలం ఒక శాతం లాక్టోస్ బ్యాక్టిరియాను అడ్డుకుంటుంది.

ఆవుపాలల్లో క్యాల్షియం ఫాస్పెట్ , పొటాషియం ఫాస్పెట్ , సోడియం క్లోరైడ్ , పొటాషియం క్లోరైడ్ , ఐరన్ ఫాస్ఫెట్ , మాంగనీస్ ఫాస్పెట్ ఉంటాయి. విటమిన్లు A , B , C , D , E , O కూడా పాలలో ఉంటాయి. పాలలో ఉండే ప్రొటీన్ కి బయోలాజికల్ విలువ బాగా ఉండి తేలికగా జీర్ణం అగును. శరీరానికి అవసరమయిన ఎమినో ఆమ్లములు దీనిలో ఉన్నాయి . ఐరన్ శాతంకూడా పాలలో లభించును.

పాలను ఎప్పుడూ గటగటా తాగకూడదు కొంచం కొంచం చప్పరిస్తూ తాగవలెను. ఇలా చేయడం వలన లాక్టోస్ లాలాజలంతో కలిసి అది జీర్ణం అవ్వడం అక్కడి నుంచే మొదలగును. పాలు ఎక్కువుగా బాలురు , వృద్ధులు , శరీరం క్షీణించినవారు , ఆకలిచే కృశించినవారు , సంగమం వలన అలసట చెందినవారు. పాలు సేవించిన త్వరగా కోలుకుందురు. పంచదార లేదా పటికబెల్లం పాలతో కలిపి సేవించిన శుక్రవృద్ధికరము , బెల్లముతో కలిపి పాలు సేవించుచున్న మూత్రకృచ్చ రోగమును పోగొట్టును . మూత్రకృచ్చ రోగం అనగా మూత్రం బొట్లుబొట్లుగా పడుచూ తీవ్రమైన బాధ కలిగి ఉండు రోగం .

ప్రతినిత్యం రాత్రి సమయముల యందు పాలు తాగుచున్న యెడల అనేక దోషములను పోగొట్టును . పాలు ఎప్పుడూ భోజన సమయానికి రెండు గంటల వ్యవధితో తాగవలెను . లేక భోజనం తినకుండా పాలు సేవించవచ్చు . పాలలో ఎప్పుడూ అన్నం కలిపి తినకూడదు. అలా కలిపి తినుచున్న అజీర్ణరోగం కలుగును. రాత్రి సమయము నందు నిద్రపట్టదు.

పాలను సేవించువారు ఇప్పుడు నేను చెప్పబోవు నియమాలను తప్పక పాటించవలెను.

* మంచి రంగు లేక రుచి చెడి , పుల్లగా , చెడువాసనతో గడ్డగడ్డలుగా ఉన్నట్టు పాలను వాడరాదు.

* పాలతో ఎల్లప్పుడూ పంచదార , అప్పుడప్పుడు మాత్రం బెల్లం కలిపి మాత్రమే ఉపయోగించవలెను .

* పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.

* చేపలకూర , మాంసాహారం తిని పాలు , పాలపదార్థాలు సేవించిన కుష్టురోగం కలుగును. ఎండుచేపలు కాని పచ్చిచేపలు కాని పాలతో ఉపయోగించకూడదు.

* పుల్లటి వస్తువులు తీసుకున్నపుడు పాలు ఉపయోగించకూడదు .

* ఉలవలు , వరిగెలు , కొర్రలు , అనుములు , అడివి పెసలు మెదలైనవి పాలతో కలిపి తినరాదు. ముఖ్యముగా అనుములు మరియు మినుములు తినిన తరువాత పాలు వాడిన అనారోగ్యం కలుగును . ఇడ్లీ , దోశ తినిన తరువాత టీ , కాఫీ సేవించరాదు .

* ముల్లంగి భుజించునప్పుడు పాలను దూరం ఉంచవలెను.

అనారోగ్యముతో బాధపడువారు రాత్రులయందు వేడివేడి గోధుమ చపాతీలు ఆకుకూరలతో గాని , తీపి పదార్థాలతోగాని , పంచదారతో గాని భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన శరీరానికి మంచి ఆరోగ్యం కలుగును. పాల యందు వెన్న అనునది ఆవులు , గేదెలు తిను ఆహారం నుండి పుట్టుచుండును. చిట్టు , పచ్చగడ్డి, పత్తిగింజలు మినపపొట్టు మొదలగునవి తిను పాలు శ్రేష్టము . పల్లపు ప్రాంతపు పశువుల పాలకన్నా మెట్టపు ప్రాంతపు పశువుల పాలు శ్రేష్టము .

నేను పైన చెప్పినటువంటి పోషకాలు , విటమిన్లు అన్నియు స్వేచ్ఛగా బయట పొలాలలో , అడవులలో తిరిగి గడ్డిమేయు ఆవులపాల యందు లభించును. అవి దేశవాళి ఆవుల పాల యందు అధికంగా పోషకాలు ఉండును.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author