ఆయుర్వేదం నందు వివరించబడిన ఆరోగ్య సూత్రాలు – 3
* మనిషి కాళ్లతో ఒళ్లును తొక్కించుకోవడం వలన వాతం తగ్గును. కఫం , శరీరంలోని కొవ్వు కరుగును. అవయవాలు గట్టిపడతాయి. చర్మం శుభ్రపడును .
* చేతులతో మెల్లగా ఒళ్లును పట్టించుకొనుటచేత మగతనం పెరుగును . కఫం , వాతం శరీర బడలిక తగ్గును. మాంసం , రక్తం పెరుగును . చర్మం శుభ్రమౌతుంది.
* ఎర్రచందనం , మంజిష్ట , కోష్ఠము , లోద్దుగపట్ట , ప్రేంఖణము , మర్రిచిగుళ్లు , చిరుశనగలు వీటన్నింటిని మెత్తటి చూర్ణం చేసి నీళ్లతో కలిపి ముఖమునకు పూసుకొనిన ముఖములో మంగు పోవును . ముఖానికి మంచి కాంతి ఏర్పడును . స్నానానికి పూర్వం పైపూతను పూసుకొనవలెను . పూసుకొనిన కొంతసేపటి తరువాత తడిగుడ్డతో తుడవవలెను. అటుపిమ్మట స్నానం ఆచరించవలెను.
* తమలపాకు , కోష్ఠము , జటామాంసి , ఎర్రచందనపు చెక్క , శనగలు , దాల్చినచెక్క వీనిని సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి శరీరానికి పూసుకొని ఒక అర్థగంట పిమ్మట స్నానం చేయుచున్న శరీరం నుండి వెలువడు దుర్గన్ధము నశించును. పైన చెప్పినటువంటి వస్తువులు దొరకనప్పుడు లేత మారేడు ఆకులు నూరి శరీరానికి పట్టించి ఉదయం మరియు సాయంత్రం అర్థగంట ఆగి స్నానం చేయుచున్న శరీరం నుంచి వెలువడు చెడువాసన పోవును .
* చన్నీళ్ళ స్నానం మంట,అలసట , చెమట,దురద , దాహం పోగొట్టును . గుండెకు మంచిది . మురికిని , సోమరితనాన్ని హరించును . సంతోషాన్ని , ఇంద్రియాలకు బలాన్ని చేకూర్చును . మగతనం పెంచును. ఆకలి కలిగిస్తుంది .
* వేడినీటితో మెడవరకు స్నానం చేయుటవలన ఒంటికి బలం వస్తుంది. వేడినీటితో తలస్నానం చేయుటవలన తలవెంట్రుకలకు , కంటికి బలం తగ్గును.
* ఉశిరిక ఒరుగు చూర్ణాన్ని తలకు , శరీరానికి రుద్దుతూ స్నానం చేసేవారు ఒళ్ళు ముడతలు పడటం , తలనెరిసిపోవడం వంటి సమస్యల లేకుండా నూరేళ్లు జీవిస్తారు.
* చన్నీటి స్నానం పడనివారు వేడినీటితో కంఠం కిందవరకే వేడినీటిని ఉపయోగించి స్నానం చేయవలెను . ఎక్కువుగా ఉండు వేడినీటిని అస్సలు వాడరాదు. తలను తడపకుండా స్నానం చేయరాదు . కొద్దిగా నీరు ఉండే జలాశయాలలో , మిక్కిలి చల్లగా ఉండు నీళ్లలో స్నానం చేయరాదు . దిగంబరుడుగా ఉండి స్నానం ఆచరించకూడదు.
* స్నానం ఆచరించిన పిదప దేహావయములను రుద్దుకోరాదు. తలవెంట్రుకలు విదిల్చరాదు. శరీరం పూర్తిగా తడి ఆరుటకు మునుపే తలపాగా , ఉతికిన బట్టలు ధరించాలి. పైనుండి వేగముగా పడు జలధార క్రింద ఉండి స్నానం ఆచరించకూడదు. ఇలా చేయుట వలన జలవేగం కారణముగా జ్ఞానేంద్రియాలకు దెబ్బ తగులు అవకాశం కలదు.
* వాతం వలన ముఖం వంకరగా పోవువ్యాధి కలిగినవారు , కండ్లకు సంబంధించిన జబ్బులు కలవారు , తలకు , చెవికి , నోటికి సంబంధించిన జబ్బు కలవారు , విరేచనం , కడుపుబ్బరం పడిసెం , అజీర్ణం వ్యాధులు కలవారు స్నానం చేయరాదు .
* శుభ్రముగా ఉండు వస్త్రాలను మాత్రమే ధరించవలెను . యశస్సు , ఆయుష్షుని వృద్దిచెందించును . అలక్ష్మిని హరించును . సంతోషాన్ని హరించును . అందాన్ని పెంచును. సభాగౌరవాన్ని పెంచును.
* పట్టు వస్త్రం , కంబళి , ఎర్రని వస్త్రం వాత,శ్లేష్మాలను పోగొట్టును . వీనిని చలికాలం ధరించవలెను . కావి రంగు వస్త్రం బుద్దిని పెంచును . చల్లదనాన్ని ఇచ్చును. పిత్తాన్ని పోగొట్టును . దీన్ని ఎండాకాలం ధరించాలి . దళసరి అయిన వస్త్రం కంటే పలుచనైనా వస్త్రం శ్రేష్టం . తెల్లని వస్త్రం మంగళకరమైనది. చలిని , ఎండని నివారించును. చలువచేయదు అదేవిధముగా వేడిచేయదు . దీనిని వానాకాలం ధరించటం మంచిది .
* నిద్రపోయే ముందు , ఇంటి నుండి బయటకి పోయే ముందు , పూజ చేయు సమయాలలో వేరువేరు వస్త్రాలను ధరించాలి . చినిగిపోయిన వస్త్రాన్ని , మురికి వస్త్రాన్ని , బాగా ఎరుపుగా ఉన్న వస్త్రాన్ని , ఇతరులు కట్టుకున్న వస్త్రాన్ని కట్టుకోకూడదు. ఇతరులచే ధరింపబడిన వస్త్రం మరియు చెప్పులను ధరించకూడదు . ముందు కట్టుకున్న వస్త్రాన్ని ఉతక్కుండా మరలా దానినే కట్టుకోకూడదు.
తరవాతి పోస్టులో మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలియచేస్తాను.
గమనిక –
నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు