ఆక్సిజెన్ పైప్ నోట్లో వేస్తే … అది పేలి పేషంట్ చనిపోయింది…
ఒక్కోసారి అభయహస్తమే మృత్యుపాశమవుతుంది .. విషం తాగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన మహిళకు కడుపులో వేసిన ఆక్సిజెన్ పైపు పేలి ఆమె చనిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు విషం తాగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. హుటాహుటిన ఆమెను అలీఘడ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంటనే చికిత్స ప్రారంభించిన డాక్టర్లు..విషాన్ని పీల్చడానికి బాధితురాలి నోటిలో పైపు వేసారు. అయితే క్షణాల్లోనే అది పేలడంతో ఆమె మృత్యువాత పడింది.
కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. మృతురాలు సల్ఫ్యూరిక్ యాసిడ్ తాగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే నోట్లో పైపు వేయగానే అందులోని ఆక్సీజన్‌తో చర్య జరగడంతో పేలుడు సంభవించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఘటనకు గల కారణాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు ఆస్పత్రి అధికార ప్రతినిధి తెలిపారు.