హిమాలయాల్లోని గుహలో ధ్యానముద్రలోకి మోడీ…


మోడీ సంచలన నిర్ణయం….
హిమాలయాల్లోని గుహలో ధ్యానముద్రలోకి మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేధారేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత.. ఓ గుహలోకి వెళ్లిపోయారాయన. ధ్యానముద్రలోకి చేరుకున్నారు. 20 గంటలు గుహలోని ధ్యానంలో ఉండనున్నట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు మోడీ గుహలోనే ధ్యానం చేయనున్నట్లు తెలిపారు. రాత్రి స్వామివారికి హారతి ఇవ్వనున్నారు.ఆ సమయంలో మాత్రం బయటకు వచ్చి.. దేవుడిని దర్శించుకుని మళ్లీ గుహలోకి వెళ్లిపోతారు. ప్రధానమంత్రి హోదాలో.. ఓ గుహలో ధ్యానం చేయటం ఇదే ప్రథమం. మోడీకి ధ్యానం, యోగా ఎంతో ఇష్టం. ప్రతి రోజు ఉదయం కొన్ని గంటలపాటు యోగా చేయందే బయటకు రారు. మోడీ దినచర్య ధ్యానం, యోగాతోనే మొదలవుతుంది. అందుకే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటానని చెబుతుంటారు.

అంతేకాదు.. దసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు. ఉత్తరాఘండ్ పర్యటనలో ఉన్న మోడీ.. మే 18వ తేదీ ఉదయం కేథరానాథ్ లోని వీరభద్రుడిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత గుహలోకి వెళ్లి ధ్యానం మొదలుపెట్టారు. మళ్లీ రేపు అనగా మే 19వ తేదీ మధ్యాహ్నం గుహ నుంచి బయటకు వచ్చి.. భద్రీనాథుడిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి వస్తారు. ప్రచారం ముగిసిన వెంటనే సాధారణ ఎన్నికలు రానున్నాయి. డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కేదారనాథ్ చేరుకున్నారు. ఉదయం దేవుణ్ని దర్శించుకుని ఉత్తరాఖాండ్‌లోని పవిత్ర గుహలో ధ్యానం చేసేందుకు ఉపక్రమించారు. ఉత్తరఖాండ్ బీజేపీ ప్రెసిడెంట్ అజయ్ భట్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఆత్మకు సంబంధించి మాత్రమే. రాష్ట్రంలోని ప్రజలు దీని గురించి వేచి చూస్తున్నారు. ఎన్నికలకు ముందు మోడీ పర్యటనలో భాగంగా ఉత్తరాఖాండ్‌లో 2రోజులు ఉంటారు

About The Author