పునాదుల్లో పురాతన ఆయుధాలు…


రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి 303 రైఫిల్స్‌ భవన నిర్మాణ తవ్వకాల్లో బయట పడ్డాయి. కాకినాడ అశోక్‌నగర్‌లోని వినాయకుడి గుడి ఎదురుగా విశాఖపట్నానికి చెందిన కేఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు సంస్థ ఎకరం భూమిని కొనుగోలుచేసి అపార్టుమెంట్స్‌ నిర్మాణం చేపడుతోంది ఈనేపథ్యంలో ఆదివారం పునాదులు తవ్వే క్రమంలో ఏడు అడుగుల లోతులో శిథిలావస్థలో ఉన్న పది రైఫిల్స్‌ను కూలీలు గుర్తించి సంస్థ మేనేజర్‌ పాకలపాటి వెంకటేశ్వర స్వరూపరాజుకు తెలియజేశారు. దీంతో అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టుటౌన్‌ ఎస్‌హెచ్‌వో అడపా నాగమురళి ఏఆర్‌ డీఎస్పీ అప్పారావు ఏఆర్‌ ఆర్‌ఐ ఈశ్వరరావు అక్కడకు చేరుకుని లభ్యమైన పది రైఫిల్స్‌ను పరిశీలించారు. అనంతరం కాకినాడ అర్బన్‌ వీఆర్వో సురేష్‌కుమార్‌ తో పంచనామా చేయించి రైఫిల్స్‌ స్వాధీనం చేసుకుని టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈవివరాలను సీఐ నాగమురళి సోమవారం విలేకరులకు తెలిపారు. కాకినాడ భానుగుడి జంక్షన్‌ నుంచి అశోక్‌న గర్‌ మీదుగా గైగోలుపాడు వరకు మిలటరీ రోడ్డు ఉందని రెండో ప్రపంచ యుద్ధం 1938-45 మధ్యకాలంలో ఈరోడ్డులో మిలటరీ క్యాంప్‌ నిర్వహించేవారని అప్పుడు వినియోగించిన ఈరైఫిల్స్‌ పాతిపెట్టి ఉంటారని ప్రాథమిక అంచనాకు వస్తున్నట్లు తెలిపారు జర్మనీకి చెందిన లీ ఇన్‌ఫీల్డ్‌ కనుగొన్న 303 రైఫిల్స్‌ రెండో ప్రపంచ యుద్ధకాలంలో అత్యంత శక్తివంతమైన ఆయు ధాలుగా గుర్తింపు పొందాయన్నారు. ఈరైఫిల్‌లో ఒక్కో మ్యాగజైన్‌ పది బుల్లెట్లు కలిగి ఉంటుం దన్నారు. అయితే ఈరైఫిల్స్‌ అన్‌క్లైమ్డ్‌ ప్రాపర్టీ నేపథ్యంలో 102సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ఈరైఫిల్స్‌ ఏకాలం నాటివో సుమారుగా ఎప్పుడు ఉపయోగించారో తెలుసుకునేందుకు పురావస్తు శాఖకు పంపుతున్నట్లు సీఐ తెలిపారు

About The Author