గుజరాత్ రాష్ట్రం లో భారీ అగ్ని ప్రమాదం… 15 మంది విద్యార్దుల దుర్మరణం


గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం… 15 మంది విద్యార్దుల దుర్మరణం

గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని షాపింగ్ కాంప్లెక్స్ నాలుగవ అంతస్థులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ చెప్పారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

నగరంలోని తక్షశిల భవన సముదాయంలోని మూడు, నాలుగో అంతస్థుల్లో మంటలు అంటుకున్నాయని, దీంతో SM Art Design Studio అనే కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న 15 మంది విద్యార్థులు భవనంపై నుంచి కిందికి దూకడంతో చనిపోయారని నితిన్ పటేల్ వెల్లడించారు.

మూడు, నాగులో అంతస్థుల నుంచి విద్యార్థులు కిందికి దూకే దృశ్యాలను చూపరుల హృదయాలను కలచివేస్తున్నాయి

19 అగ్నిమాపక యంత్రాలు, రెండు హైడ్రాలిక్ యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు

ఈ భవనంలో ఇంకా చాలామంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. విద్యార్థులు, మంటల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు.

”పొగ, మంటల నుంచి తమను తాము కాపాడుకునేందుకు విద్యార్థులు మూడు, నాలుగో అంతస్థుల నుంచి కిందికి దూకేశారు. వారిలో చాలామందిని కాపాడి ఆసుపత్రికి తరలించాము, మంటల్ని ఆపేందుకు కృషి చేస్తున్నాం” అని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు చెప్పారు.

About The Author