మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మరియు క్రీడా శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో సాంస్కృతిక, క్రీడా మరియు సాహిత్య అకాడమీ లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్పోర్ట్, టూరిజం కమిషనర్ దినకర్ బాబు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, టూరిజం M D మనోహర్ లు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లాల్ బహదూర్ స్టేడియం స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం స్టేడియం లో ఉన్న ఫ్లైడ్ లైట్స్ టవర్స్ యొక్క నాణ్యత పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాలివానకు కూలిపోయిన టవర్ పై, గ్యాలరీ పైకప్పు స్థితిగతులపై సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రి అధికారులను కోరారు. స్టేడియం లో ఉన్న మౌలిక వసతులు, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ కనబరిచే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని మంత్రి కోరారు. హైదరాబాద్ నగరంలో ఉన్న, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో ఉన్న పాత క్రీడా మైదానాల స్థితిగతుల పై నివేదికను సమర్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర అవతరణ దినోత్స వాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై చర్చించారు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఇ శ్రీనివాస్ గౌడ్ డ్ ఆదేశించారు అవతరణ దినోత్సవం సందర్భంగా గా జూబ్లీ హాల్లో నిర్వహిస్తున్న కవి సమ్మేళనం పై మంత్రి చర్చించారు అదేరోజు సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే రాష్ట్ర ప్రభుత్వ శాఖపరమైన అవార్డుల ప్రధానోత్సవం పై చర్చించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక శాఖ సారథ్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులపాటు కార్యక్రమాల రూపకల్పన పై చర్చించారు.
రవీంద్రభారతిలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.జూన్ రెండో తారీఖున కవి సమ్మేళనం నిర్వహించాలని, జూన్ 3న సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే జూన్ 4న రాష్ట్ర అవతరణ సందర్భంగా అవతరణ ఫిల్మోత్సవ్ ను నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కవిసమ్మేళనం సాంస్కృతిక కార్యక్రమాలు,ఫిల్మోత్సవ్ లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేవిధంగా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఈ సమావేశంలో తెలంగాణ సాహిత్య అకాడమీ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలుతీరుపై ఉన్నత అధికారులతో చర్చించారు.