ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ పనులను తక్షణం ఆపేయండి… ఏపీ సీఎస్


ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ పనులను తక్షణం ఆపేయండి… ఏపీ సీఎస్

ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో నిధులు వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ మెమో జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఎఫ్ఆర్ బీఎం పరిమితులు పట్టించుకోకుండా గతంలో మంజూరు చేసిన ఇంజనీరింగ్ పనులు రాష్ట్ర ఖజానాపై భారం పడేలా చేశాయని మెమోలో పేర్కోన్న సీఎస్

ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన కొన్ని ప్రాజెక్టు పనుల్ని కూడా సమీక్షించాల్సి ఉంది.

దిగజారుతున్న ఆర్ధిక వనరులు… ఆనాలోచిత ఆర్ధిక నిర్ణయాలను ఉదహరిస్తున్నాయి.

చెల్లింపులకు ఆర్ధిక వనరులు లేనందున రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సదరు ఇంజనీరింగ్ పనులు తక్షణం నిలిపివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్…

2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దు చేయాలని ప్రభుత్వ శాఖలకు సూచన
25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో విలువను తాజాగా నిర్ధారిచి..తదుపరి చెల్లింపులు చేయొద్దని స్పష్టం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

పేదల సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలన అందించటమే కొత్త ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నందున అన్ని శాఖల కార్యదర్శులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలంటూ స్పష్టం చేసిన సీఎస్

విభాగాధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారం ధృవీకరించిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని పే అండ్ ఆకౌంట్స్ కార్యాలయానికి మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

About The Author