సన్యాసులపై అభిప్రాయం మారిపోయింది BJP చేసిన..చేస్తున్న ఈ సంప్రదాయం భేష్…
రాజకీయ పార్టీల్లో
ఇలాంటివారు ఉండడం ఒక ఎత్తు అయితే
వారికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం ఇంకో ఎత్తు
ప్రజలు వారిని ఆదరించి గెలిపించడం అనేది
నా ఉద్దేశ్యంలో ఇదే నిజమైన ప్రజాస్వామ్యం.
.
ఎవరు ఈయన..?
ఏమిటి ఈయన గొప్పదనం ?
.
పేరు చంద్ర సారంగి..
అలియాస్ మోడీ బాలాసోర్(ఒరిస్సా మోడీ)
ఉండేది ఒరిస్సా రాష్ట్రంలో..
పోటీ చేసింది : బాలాసోర్ MP
.
ఈయన నేపధ్యం ఒకసారి
ఈ ఫోటోలలో చుస్తే సరిపోతుంది..
అయన జీవితం జీవనశైలి ఎలాంటిదో అర్ధం అవుతుంది…
.
ఫోటోలో ఉన్నది అయన ఇల్లు
సరిగా ఇంటి పైన గడ్డికూడా లేదు..ఇంకా కప్పాల్సి ఉంది
ఇక ఆయన భుజానికి ఓ సంచీ కాళ్లకు ఆకు
చెప్పులు తప్ప ఏమి పెద్దగా వేసుకోరు.
365 రోజులు ఆయన్ను ఎప్పుడు చూసినా ఇలాగే కనిపిస్తారు.
మరి ప్రజా ప్రతినిధికి వాహనం లేకపోతే ఎలా అనుకున్నారా ?
ఉంది ఆయనకు ఒక సైకిల్ ఉంది..అదే అయన వాహనం.
తనకు ఉన్నదానిలో ఏముంటే అది పంచేస్తూ ఉంటారు.
దారిలో చిన్న పిల్లలతో ఆడుకుంటారు.
వారికి ఎదో ఒకటి ఇస్తూ పంచుతూ ఉంటారు.
.
అయన ఒరిస్సాలో MLAగా రెండుసార్లు గెలిచారు కూడా.
మారుమూల తండాలకు కాలినడక వెళుతుంటారు.
స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ కనిపిస్తారు.
ఎవరు ఏం పెట్టినా సంతోషంగా తినేస్తారు.
రాత్రి ఆలస్యమైతే ఏ గుడిసె ముందో
కుక్కి మంచం వేయించుకుని పడుకుంటారు
.
అయన తన ప్రయాణాలు
మొత్తం సైకిల్‌పై సాగించేవారు.
గతేడాది ఈయన తల్లి మరణించేవరకు ఆమెతో
కలిసి ఓ చిన్న గదిలోనే నివాసమున్నారు.
ఆదివాసీ ప్రాంతమైన మయూర్ భంజ్,
బాలాసోర్‌లలో పాఠశాలలు నెలకొల్పారు.
సామాజిక న్యాయం కోసం పోరాటం సాగించారు.
మద్యం, అవినీతి, పోలీసుల దురాగతాలపై ఉద్యమించారు.
ఎన్నికల ఆటోలోనే ప్రచారం చేశారు.
ఎన్నికల్లో గెలిచాక కూడా తన బ్యాగును
తానే సర్దుకుని ఢిల్లీకి వెళ్లారు సారంగి
మరిచిపోయా ఇన్నాళ్ళ తన ప్రజా
జీవితంలో తన వ్యక్తిగత డబ్బు పది లక్షలు మాత్రమే
.
ఇలాంటి నిరాడంబరత గుర్తించిన BJP కేంద్ర నాయకత్వం
ఆయన్ను MP గా బాలాసోర్ పార్లమెంట్ స్థానం నుండి నిలబెట్టింది.
గత ఎన్నికల్లో ఓడిపోయిన అయన ఈసారి నవీన్ పట్నాయక్
హవాలోనూ 13 వేల ఓట్లతో ప్రజల మనసు గెలిచారు.
గెలవడమే కాకుండా అయనకి నేడు కేంద్రంలో మంత్రిగా
అవకాశం ఇవ్వడం కూడా ఆషామాషీ కాదు.
.
ఈయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సన్యాసి.
.
అంతకుముందు సన్యాసులు రాజకీయాల్లో ఎందుకు ?
వాళ్ళకి ప్రజల కష్టాలు ఏమి తెలుసు అనుకునేవాడిని ?
కానీ నేడు ఈయనలాంటి సన్యాసులకి BJP టికెట్లు ఇచ్చి
మంత్రులు MP MLA ముఖ్యమంత్రులని చేస్తుంటే
పెళ్ళాం పిల్లలతో ఉండేవారికంటే డబ్బు హోదా కోసం
వ్యాపారాల కోసం రాజకీయాల్లో వచ్చేవారికంటే
ఇలాంటివారు ప్రజల కష్టాలని అర్ధం చేసుకుంటారని అనిపిస్తుంది.
అంతకంటే ముఖ్యంగా వాళ్ళకంటే ఈయనలాంటి
వాళ్ళు ఆకాశమంత ఎత్తులో ఉన్నట్టే అని నా భావన
.
ఇలాంటివాళ్ళకి నేటి ధన రాజకీయాల్లో
టికెట్లు ఇచ్చి ప్రజల మధ్య నిలబెట్టడం ఒక ఎత్తైతే
ప్రజలు వారిని ఎన్నుకోవడం నిజంగా ముదావహం.
నిజంగా ఇలాంటివారికీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన
BJP మనస్పూర్తిగా మనం అభినందించాలి..
ఇతర పార్టీలు ఇలాంటి పనులు చేసినా వారికి
ఇవే అభినందనలు వర్తిస్తాయనడంలో సందేహం లేదు.
.
అయన ఎంపీ అయ్యాక ఒకరు ఆయన్ను
మీకు జీతభత్యాలు ఎక్కువుంటాయి అలాగే
ఎంపీల్యాడ్స్ నిధులూ ఎక్కువే..వాటితో ఏమి చేస్తారు అంటే..
ఓహో అయితే ఇంకొన్ని స్కూళ్లకు పక్కా బిల్డింగులు
నా నిధులతోనే కట్టవచ్చునన్నమాట అని అంటారు..
.
ఇంకొకరు మీరు డిల్లీలో ఎక్కడుంటారంటే..
ఏం..ఢిల్లీలో రైల్వే ప్లాట్‌ఫారాలుండవా..?
రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు ఉండవా అని ఎదురు ప్రశ్న వేశారు??
ఆయనంత నిరాడంబరుడు బహుశా మనకు నేటి
రాజకీయాల్లో నాయకుల్లో ఎవరు కనిపించరేమో..
ఇలాంటి వారు నిజమైన ప్రజాసేవకులు అంటే..
.
పేరుకు అయన సన్యాసి కావచ్చు..
ఆయనకు ముక్తి దొరుకుందో లేదో తెలియదు
కానీ ఎందఱో ప్రజల గుండెల్లో నిజమైన సేవామూర్తిగా
నిలచిపోయారనడంలో సందేశం లేదు..శుభం భూయాత్.