రియల్ రౌడీ షీటర్ తో యాక్టింగ్ అంటే కొంచెం రిస్కే … TNR


ఈరోజు రిలీజ్ అయిన “ఫలక్ నుమా దాస్” లో ఒక సీన్ లో నేను ఒక రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి వాన్ని లాగి కొట్టి వార్నింగ్ ఇచ్చి అరెస్ట్ చెయ్యాలి.
ఆ సీన్ లో యాక్ట్ చేసే ముందు హీరో & డైరెక్టర్ అయిన విశ్వక్ సేన్ నన్ను పక్కకు పిలిచి చెవిలో ” సర్ అతను నిజంగానే పెద్ద రౌడీ షీటర్… అతన్ని చెంప మీద కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త సర్…తేడాలొస్తే సీరియస్ అవుద్ది సర్ మ్యాటర్..అతను చాలా డేంజర్” అని హింట్ ఇచ్చాడు.
అలా అంత బాగా హింట్ ఇచ్చాక ఏ యాక్టర్ కి అయినా ఎలా ఉంటుంది…?
ప్యాంట్ తడిసిపోదూ…?
ఇచ్చే ఎక్స్ ప్రెషన్ మీద ,చెప్పే డైలాగ్ మీద కాన్సంట్రేషన్ పెట్టకుండా చెయ్యి అతనికి ఎక్కడ తాకుతుందో అన్న టెన్షన్ ఉంటుంది.
ఆ టెన్షన్ లో ఎలా యాక్ట్ చేశానో నాకే తెలుసు..
కానీ సీన్ లో అతను బాగా కో ఆపరేట్ చేశాడు.
ఎక్కడా రాష్ గా నాతో బిహేవ్ చెయ్యలేదు.
ఫైనల్ గా ఆ సీన్ బాగానే వచ్చింది.
ఇప్పటికే సినిమా చూసిన చాలా మంది అదేంటండి అతన్ని నిజంగా కొట్టేశారా అని అడుగుతున్నారు.
కానీ కనీసం నా చెయ్యి వేళ్ళు కూడా అతని చెంపని తాకలేదు…ఇది నిజం..
నిజంగా కొట్టలేదు అంటే ఎవరూ అంత ఈజీగా నమ్మట్లేదు.
కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే … ఈ సీన్ షూటింగ్ అయిన సరిగ్గా రెండు నెలలకి చార్మినార్ ఏరియాలో ఈ రౌడీ షీటర్ మర్డర్ జరిగింది.
ఎవరో వ్యక్తులు చాలా దారుణంగా అతన్ని నరికి చంపేశారు…
ఎంత పెద్ద క్రిమినల్ అయినా,పేరుమోసిన రౌడీ షీటర్ అయినా తనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను కాబట్టి అతను మర్డర్ అయిన రోజు బాధేసింది…అయ్యో పాపం అనుకున్నాను..
క్రింది ఫోటోలో పింక్ షర్ట్ వేసుకున్న వ్యక్తే మర్డర్ అయిన రౌడీ షీటర్…
సినిమా బిగినింగ్ టైటిల్స్ లో”DEEP CONDOLENCE” అని వేసిన ఫోటో అతనిదే…

About The Author